చౌడేశ్వరి దేవికి… శిఖర కలశ స్థాపన..మహాకుంభాభిషేకం..
1 min readపల్లెవెలుగు వెబ్, చెన్నూరు: కడప జిల్లా చెన్నూరు పరమట వీధిలో వెలసిన శ్రీ రామలింగ చౌడేశ్వరి దేవి ఆలయంలో ఆదివారం శిఖర కలశం స్థాపన మహా కుంభాభిషేకం ఆలయ కమిటీ నిర్వాహకులు భక్తులు అత్యంత వైభవంగా నిర్వహించారు. రామలింగ చౌడేశ్వరి దేవి 93వ అమ్మవారి జయంతి ఉత్సవాలతో పాటు మహా కుంభాభిషేకం ఈనెల 28 నుంచి 31 వరకు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తెల్లవారుజామున 5 గంటల నుంచి చౌడేశ్వరి దేవి కి సుప్రభాత సేవ గణపతి పూజ అభిషేక పూజ నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక అలంకరణ ఏర్పాటు చేశారు. చెన్నూరు కు చెందిన వేద పండితులు గిరి స్వామి శివ బృందంచే నవ కలశ అమ్మవార్ల అలంకరణ చండీ హోమం దంపతుల చేతులు మీదుగా నిర్వహించారు. వేదపండితుల మంత్రాల మధ్య శిఖర కలశం సంప్రోక్షణ మహా కుంభాభిషేకం నిర్వహించారు అమ్మవారికి సింహవాహన ప్రతిష్ట అమ్మవారి త్రిశూల ప్రతిష్ట. ఆయుధ ప్రతిష్ట నిర్వహించారు. చౌడేశ్వరి దేవి అమ్మవారు ప్రత్యేక అలంకరణ తో భక్తులకు దర్శనం ఇచ్చారు. నాలుగు రోజులపాటు జరిగిన ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రాంతాలనుంచి వేలాది మంది భక్తులు చౌడేశ్వరి దేవిని ఉన్నారు. అమ్మవారిని దర్శించుకున్న వారిలో పలువురు రాజకీయ నాయకులు తదితరులు ఉన్నారు. అమ్మవారిని దర్శించుకునే భక్తులకు మధ్యాహ్నం అన్నసంతర్పణ ఆలయ కమిటీ నిర్వాహకులు ఏర్పాటు చేశారు.