చౌదరి బహిరంగ చర్చకు సిద్ధమా
1 min read– కురువ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుడిసె శివన్న
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కళ్యాణ్ దుర్గం నియోజకవర్గంలో టిడిపి అధికారంలో ఉన్న సమయంలో ఉన్నంత హనుమంతరాయ చౌదరి ఆయన కుమారుడు ఉన్నంత మారుతి చౌదరి గవర్నమెంట్ భూములు చుక్కలు భూములు ఆక్రమించిన వందల ఎకరాల భూములు వాస్తవం కాదా? దాన్ని కప్పిపుంచేందుకు బీసీ మహిళ మంత్రి శ్రీమతి ఉషా చరణ్ శ్రీ పై అసత్యపు ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదని ఉన్నం హనుమంతరాయ చౌదరి ఆయన కుమారుడు ఉన్న మారుతి చౌదరి మీరు మాట్లాడినంత మాత్రాన అబద్ధం నిజం కాదు నిజం అబద్ధం కాదు అని అందరికీ తెలుసు అది మీకు కూడా తెలుసునని కురువ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుడిసె శివన్న కర్నూలు జిల్లా కురువ సంఘం ప్రధాన కార్యదర్శి రంగస్వామి మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు అనంతపూర్ జిల్లాలో టిడిపి నేతలు కొంతమంది వైయస్సార్ లో ఉన్న కురువలపైన తప్పుడు స్టెట్ మెంట్ల తప్పుడు ఆరోపణలు చేస్తూ కురువలను బ్రష్టు పట్టించే విధంగా మీ ప్రవర్తన తీరు ఉంది దీనికి తగిన మూల్యం వచ్చే ఎన్నికల్లో కురువల సత్తా ఏందో చూపిస్తాం చౌదరి గుర్తుంచుకో. సృజన కంపెనీకి చెందిన సర్వే నెంబర్ 225 లో 70.40 ఎకరాల భూమి మంత్రి తీసుకున్నట్లు మీ ఎల్లో మీడియా పత్రికల్లో వార్తలు రాస్తే అది ప్రజలు నమ్ముతారని అపోహపడి మీరు ఇలాంటి తప్పుడు రాతలు వ్రాయించడం మానుకోవాలని లేకపోతే మీరు రాజకీయాల్లో కనుమరుగవుతారని హెచ్చరించారు. నీతి నిజాయితీకి మారుపేరైన కురువలు రాజకీయాల్లోకి రావడం జీర్ణించుకోలేక ఉన్నత వర్గాల్లో చౌదరి వర్గం మాపై కక్ష కట్టి తప్పుడు వీడియోలు తప్పుడు వార్తలు సృష్టించడం సబబు కాదు కానీ ఇది మీకు కొత్తెమి కాదని ఎలాంటి నీచమైన పనులు చేసైనా అధికారంలోకి రావాలని చూస్తే తగిన గుణపాఠం తప్పదని గుడిసె శివన్న రంగస్వామి హితవు పలికారు కల్యాణదుర్గం గవర్నమెంట్ భూములు చుక్కల భూములు మీ కుటుంబ సభ్యులు అక్రమంగా ఆక్రమించక పోతే బహిరంగ చర్చకు సిద్ధం కావాలని హెచ్చరించారు.