PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చౌక‌గా చ‌మురు.. పెట్రోల్, డీజిల్ ధ‌ర త‌గ్గుతుందా ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ముడి చమురు విషయంలో ముందుకే వెళ్లాలని భారత్‌, రష్యా నిర్ణయించాయి. ఈ మేరకు రెండు దేశాల మధ్య డీల్‌ కుదిరింది. డిస్కౌంట్‌ ధరతో రష్యా నుంచి ముడి చమురును దిగుమతి చేసుకోవడానికి భారత్‌ సిద్ధమైంది. త్వరలోనే 3.5 మిలియన్‌ బ్యారెళ్ల ముడి చమురును భారత్‌కు ఎగుమతి చేయాలని రష్యా నిర్ణయించింది. భారత్‌కు చమురు రవాణాతోపాటు బీమాకు సంబంధించిన అన్ని అంశాల విషయంలో రష్యా జాగ్రత్తలు తీసుకోనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. చెల్లింపులకు సంబంధించి కేంద్రం నుంచి ఎలాంటి స్పష్టత రాకపోయినప్పటికీ… రూపాయి – రూబెల్‌ మారకం పద్ధతిలోనే ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిసింది. రష్యా నుంచి వచ్చిన డిస్కౌంట్‌ ఆఫర్‌కు స్పందిస్తూ… ముడి చమురును దిగుమతి చేసుకోవాలని భావిస్తున్నట్టు కేంద్రమంత్రి హర్దీప్‌ పురి రాజ్యసభలో గత సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ర‌ష్యా నుంచి చౌక‌గా ముడి చ‌మురు దిగుమ‌తి చేసుకుంటున్న నేప‌థ్యంలో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు త‌గ్గ‌నున్నాయా ? అన్న ప్ర‌శ్న త‌లెత్తుతోంది.

                                        

About Author