రాంగోపాల్ వర్మ పై చీటింగ్ కేసు !
1 min readపల్లెవెలుగువెబ్ : ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ పై హైదరాబాద్లోని మియాపూర్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. శేఖర్ ఆర్ట్ క్రియేషన్ యజమాని కొప్పాడ శేఖర్ రాజు ఫిర్యాదు మేరకు వర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే వర్మ దీనిపై ఇంకా స్పందించాల్సి ఉంది. శేఖర్ రాజు అనే కొన్నాళ్ల క్రితం రమణారెడ్డి అనే కామన్ ఫ్రెండ్ ద్వారా రామ్ గోపాల్ వర్మతో తనకు పరిచయం ఏర్పడిందని తెలుపుతూ.. ఈ క్రమంలో వారి మధ్య పరిచయం పెరిగి అతను వర్మకి జనవరి 2020లో ₹ 8 లక్షలు, కొన్ని రోజుల తర్వాత మరో ₹ 20 లక్షలు, మరోసారి రూ. 28 లక్షలు తీసుకుని తన సినిమా విడుదలకు ముందే ఈ మొత్తాన్ని ఇస్తానని తనకు హామి ఇచ్చినట్లు ఫిర్యాదులో తెలిపారు.వర్మ చెప్పిన సమయం దాటిపోవడం, పైగా ఆ చిత్రానికి వర్మ నిర్మాత కాదని రాజుకు తెలియడంతో అతను మోసపోయినట్లు గ్రహించానని అందుకే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.