చెక్ బౌన్స్ కేసు.. ఇక నుంచి చిన్న నేరమే !
1 min readపల్లెవెలుగువెబ్ : చిన్న చిన్న ఆర్థిక నేరాల పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సులభతర వ్యాపార నిర్వహణ మెరుగుపర్చే యోచనలో భాగంగా సంస్కరణలకు కసరత్తు చేస్తోంది. ఉదా హరణకు మన బ్యాంకు ఖాతాలో తగినంత నగదు లేకపోవడం వల్ల.. మనమిచ్చిన చెక్ బౌన్స్ అయితే నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద రెండేళ్లదాకా జైలు శిక్ష, చెక్ మొత్తానికి రెట్టింపు జరిమానా, లేక రెండూ విధించవచ్చు. రుణాల చెల్లింపు ని బంధనలను ఉల్లంఘించినా క్రిమినల్ నేరమే. అయితే.. ఇలాం టి చిన్న చిన్న ఉల్లంఘనలను క్రిమినల్ నేరాలుగా విచారించి శిక్షలు వేయాల్సిరావడంతో కోర్టుల్లో కేసు లు పేరుకుపోతున్నాయి. సులభతర వ్యాపార నిర్వహణకు కూడా ఇది అడ్డంకిగా మారుతోంది. సులభతర వ్యాపార నిర్వహణను మె రుగుపరచేందుకు ప్రయత్నిస్తున్న మోదీ సర్కారు.. చిన్నచిన్న ఆర్థికపరమైన ఉల్లంఘనలను క్రిమినల్ నేరాల పరిధి నుంచి తప్పించేందుకు చాలాకాలంగానే కసరత్తు చేస్తోంది.