PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆయుర్వేదంతో కిడ్నీ వ్యాధికి చెక్ !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఆయుర్వేద ఔష‌ధం నీరి-కేఎఫ్‌టీ తో మూత్రపిండాల వ్యాధికి చెక్ పెట్టొచ్చని తాజా అధ్యయ‌నంలో తేలింది. ఇది దీర్ఘకాల కిడ్నీ వ్యాధి తీవ్రత‌ను నెమ్మదింప‌జేస్తుంద‌ని, అలాగే ఆ అవ‌య‌వం మున‌ప‌టిలా ఆరోగ్యంగా ప‌నిచేసేందుకు దోహ‌ద‌పడుతుంద‌ని ఈ అధ్యయ‌నంలో తేలింది. ఈ ప‌రిశోధ‌న వివ‌రాలు సౌదీ జ‌ర్నల్ ఆఫ్ బ‌య‌లాజిక‌ల్ సైన్సెస్ లో ప్రచురిత‌మ‌య్యాయి. భార‌త్ కు చెందిన ఏఐఎంఐఎల్ ఫార్మాస్యూటిక‌ల్ సంస్థ నీరి-కేఎఫ్‌టీని ఉత్పత్తి చేస్తోంది. క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనే దీర్ఘకాల రుగ్మత‌పై ప‌రిశోధ‌కులు ఈ ఔష‌ధాన్ని ప‌రిశీలించారు. ఆక్సిడేటివ్, ఇన్ల్ఫమేట‌రీ ఒత్తిడి వ‌ల్ల క‌ణాలు మృతి చెంద‌డాన్ని ఈ మందు నిలువ‌రిస్తుంద‌ని ప‌రిశోధ‌కులు తెలిపారు.

About Author