PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మధ్యాహ్న భోజన పనితీరును పరిశీలించండి

1 min read

– ఉపాధ్యాయులతో మండల విద్యాశాఖ అధికారి. స్టెల్లా షర్మిల రాణి
పల్లెవెలుగు, వెబ్ చెన్నూరు: మండలంలో ఉన్నత పాఠశాలలు ప్రాథమికోన్నత పాఠశాలలు ప్రాథమిక పాఠశాలలు నందు వంట ఏజెన్సీ తయారు చేసే భోజనంతోపాటు ఆహార పదార్థాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని చెన్నూరు మండల విద్యాశాఖ అధికారి స్టెల్లా షర్మిల రాణి ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులను కోరారు. చెన్నూరు మండలంలో పాఠశాలలకు రంగు మారిన గుడ్లు చెడిపోయిన గుడ్లు ఏజెన్సీ వారు సరఫరా విషయంపై శుక్రవారం మధ్యాహ్నం చెన్నూరు ఎంఆర్సి కార్యాలయంలో ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల విద్యాశాఖ అధికారి స్టెల్లా షర్మిల రాణి మాట్లాడుతూ పాఠశాలలకు బియ్యము కంది బేడలు గుడ్లు కూరగాయలు ఇతర ఆహార పదార్థాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలని కోరారు. వంట ఏజెన్సీ వారు వంట ఎలా చేస్తున్నారు పరిశీలిస్తుండాలన్నారు. వంట ఏజెన్సీలో ఏవైనా లోటుపాట్లు ఉన్నా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ఆమె సూచించారు. మండల వ్యాప్తంగా అన్ని పాఠశాలలో రంగు మారిన గుడ్లు చెడిపోయిన గుడ్లు స్థానంలో ఏజెన్సీ వారు నాణ్యత కలిగిన గుడ్లను వాహనాల ద్వారా పాఠశాలలకు చేర్చడం జరిగిందని ఇప్పటికే 75 శాతం పాఠశాలలకు నాణ్యత గల గుడ్లు అందే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది అన్నారు. చెడిపోయిన గుడ్లను ఏజెన్సీ వారే తీసుకువెళ్లారని ఉపాధ్యాయులకు సూచించారు. ఇలాంటి సంఘటనలు పునరావతం కాకుండా వంట ఏజెన్సీ ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. సమావేశంలో చెన్నూరు బాలుర ఉన్నత పాఠశాల. బాలికల ఉన్నత పాఠశాల కొండపేట, రామనపల్లి, చిన్న మాసుపల్లి, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు మండల విద్యాశాఖ ఎమ్మార్సీలు పాల్గొన్నారు.

About Author