సంచార చికిత్స కార్యక్రమం తనిఖీ..
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: కో -లోకేటెడ్ కోడుమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని బోయగేరిలో జరుగుచున్న సంచార చికిత్స కార్యక్రమాన్ని జిల్లా నోడల్ అధికారి డాక్టర్ రఘుగ ఆకస్మికంగా తనిఖీ చేశారు, అనంతరం మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధిపై అవగాహనా కల్పించినారు.నోటిలో ఎరుపు లేదా తెలుపు మచ్చ మానకుండ ఉండటం మరియు 2 వారలైన పుండు మానకపోవటం, మింగటంలో లేదా నోరు తెరవడంలో ఇబ్బంది పడడం, రెండు నుండి మూడు వారాలు మించి స్వరంలో మార్పులు, నోరు, గొంతు లేదా మెడలో గడ్డ ఉండడం, ఉన్నట్లుండి ఒక్కసారిగా బరువు తగ్గడం లాంటి లక్షణాలు కనిపిస్తాయని తెలిపారు,18 సంవత్సరంములు దాటినా ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ శ్రీమంత్ మాదన్న , ఎం పి హెచ్ ఈ యు నరసప్ప, హెల్త్ సూపర్వైజర్ కమాల్ సాహెబ్ , ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు, ప్రాజెక్షనిస్ట్ ఖలీల్ మరియు ప్రజలు పాల్గొన్నారు.