తలలో ‘చుండ్రు’ కు ఈ ఆహార పదార్థాలతో చెక్ !
1 min readపల్లెవెలుగు వెబ్ : చాలా మందిని తలలో చుండ్రు తరచూ వేధిస్తుంటుంది. అదొక సమస్యగా మారుతుంది. దీని పరిష్కారం కోసం చాలా మంది యాంటీ డాండ్రఫ్ షాంపూలు వాడుతారు. షాంపూలతో పాటు తినే ఆహారం మీద కూడ దృష్టి పెట్టాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. మనం తీసుకునే ఆహారంలో జింక్, విటమిన్ బీ6 ఉండేలా చూసుకుంటే చుండ్రు సమస్య చాలా వరకు తగ్గుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మన తలలోని తైలగ్రథుల నుంచి ఈ చుండ్రు పుట్టుకొస్తుంది. ఇది ఎక్కువగా ఉత్పత్తి అయితే చుండ్రుగా మారుతుంది. తలలో చికాకుగా ఉంటుంది. తలలో సీబమ్ ఉత్పత్తిని నియంత్రించడానికి జింక్ తోడ్పడుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. జింక్ ను బాగా శరీరం గ్రహించుకోవడానికి విటమిన్ బి6 కూడ అవసరం. ఇందుకోసం కందులు ,పెసలు, శనగలు, మినుములు వంటి పప్పులు.. బాదం, పిస్తా, ఆక్రోట్ల వంటి గింజపప్పులు.. జొన్నలు, సజ్జలు, దంపుడు బియ్యం, పొట్టుతీయని గోధుమలు మన ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. అప్పుడే చుండ్రు సమస్య తగ్గే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.