పెండింగ్ బిల్లులు వచ్చేలా చూడండి
1 min readపల్లెవెలుగు,చాగలమర్రి:మండలంలోని వివిధ గ్రామాల్లో హౌసింగ్ పరిధిలో గృహ నిర్మాణాలు చేపడుతున్న లబ్దిదారులకు ఎన్ఆర్ఈజిఎస్ లో పెండింగ్ లో ఉన్న భిల్లులు త్వరితగతిన వచ్చేలా చర్యలు తీసుకోవాలని హౌసింగ్ డిఈ నాగరాజు తెలియజేసారు.చాగలమర్రి ఎంపిడీఓ కార్యాలయంలో ఎంపిడీఓ మహబూబ్దౌలా ఆధ్వర్యంలో ఇంజనీరింగు సహాయకులు,ఉపాధి,హౌసింగ్ సిబ్బందితో బుధవారం సమావేశం ఏర్పాటు చేసారు.ఈ సమావేశంలో డిఈ మాట్లాడుతూ గృహ నిర్మాణాలు చేపట్లటిన బ్దిదారులకు ఇంకా పెండింగ్ లో ఉన్న ఉపాధి నిధులకు సంబంధించిన రూ 23 వేలు వెంటనే వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.జగనన్న లే అవుట్లలో గృహ నిర్మాణాలు జులై 15 నాటికి పూర్తి అయ్యేలా కృషి చేయాలని సూచించారు.కార్యక్రమం లో హౌసింగ్ ఏఈ షఫివుల్లా,ఏపిఓ నిర్మల,హౌసింగ్ సిబ్బంది,సచివాలయాల ఇంజనీరింగు సహాయకులు పాల్గొన్నారు.