దివ్యాంగురాలుకి.. చెక్కు పంపిణి
1 min read– జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సామూన్, స్థానిక ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి
పల్లెవెలుగు, వెబ్ నంద్యాల: మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతూ ముఖ్యమంత్రిని కలిసిన దివ్యాంగురాలికి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి లక్ష రూపాయల చెక్కును జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సామూన్, స్థానిక ఎమ్మెల్యే శిల్పారవిచంద్ర కిషోర్ రెడ్డిలు అందజేశారు. మంగళవారం నంద్యాల పట్టణంలోని జగజ్జననీనగర్ కు చెంది అనారోగ్యంతో బాధపడుతున్న హిమపావని కుటుంబానికి వెళ్లి వారుపరామర్శించారు. ఈనెల 17 సీఎం ఆళ్లగడ్డ పర్యటనలో సీఎంను కలసి హిమపావని మెదడు సంబంధిత వ్యాధి సమస్యను మొరపెట్టుకున్న విషయం విదితమే. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు జిల్లా కలెక్టర్ ముఖ్యమంత్రి సహాయనిధి నుండి లక్ష రూపాయల చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆర్ధిక స్థోమత లేని అ కుటుంబంలో దివ్యాంగురాలైన హిమపావనికి, వృద్ధురాలైన చింతల లక్ష్మీదేవికి పెన్షన్ మంజూరుకు చర్యలు తీసుకోవాలని డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డిని కలెక్టర్ ఆదేశించారు.రాష్ట్ర ముఖ్యమంత్రి సూచనల మేరకు మెదడు సంబంధిత వ్యాధితోబాధపడుతూ వైద్యం చేయించుకునే స్థోమత లేని హిమపావనిని గురువారంవైద్య చికిత్సల నిమిత్తం ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ప్రత్యేక వాహనంలో హైదరాబాద్ పంపుతున్నట్లు తెలిపారు. వైద్యానికి అయ్యే ఖర్చు సీఎం రిలీఫ్ ఫండ్ నుండి మంజూరు చేయబడుతుందని ఆయన తెలిపారు. బాధితురాలికి రాష్ట్ర ముఖ్యమంత్రి భరోసా కల్పించారని ఆయన ఈ సందర్భంగా అన్నారు.