PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తెలంగాణకు చెక్​ పెట్టాల్సిందే..!

1 min read

– ‘శ్రీశైలం’ను బహుళార్ధకసాధక ప్రాజెక్టుగా గెజిట్​లో పెట్టాలి

  • రౌండ్ టేబుల్ సమావేశంలో అఖిల పక్ష నేతల డిమాండ్
    పల్లెవెలుగు వెబ్​, రాయచోటి : విద్యుత్ అవసరాల పేరుతో తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం నీటిని తోడేసి సముద్రం పాలు చేస్తుంటే ..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చోద్యం చూస్తోందని ఆరోపించారు రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ కమిటీ కన్వీనర్ నాగిరెడ్డి, రాయలసీమ సాగునీటి సాధన సమితి కన్వీనర్ దేవగుడి చంద్రమౌళీశ్వర రెడ్డి. రాయలసీమ పట్ల బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే శ్రీశైలం ప్రాజెక్టు ను బహుళార్థసాధక ప్రాజెక్టుగా గెజిట్ నోటిఫికేషన్ తీసుకురావాలని డిమాండ్​ చేశారు. అంతేకాక కృష్ణానది యాజమాన్య బోర్డు పరిధి నిర్దేశించి… కేంద్ర బలగాలతో రాష్ట్ర నీటి హక్కులు కాపాడాలని వారు డిమాండ్ చేశారు. మంగళవారం రాయచోటి ఎన్జీవో హోంలో ఏపీ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి వి.రంగారెడ్డి అధ్యక్షతన అఖిలపక్ష రైతు సంఘాల, పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ కమిటీ కన్వీనర్ నాగిరెడ్డి రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధన సమితి కన్వీనర్ దేవగుడి చంద్రమౌళిశ్వర్ రెడ్డి ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి చంద్ర, దస్తగిరి రెడ్డి, రైతు స్వరాజ్య వేదిక జిల్లా కన్వీనర్ శివారెడ్డి, ఓ పి డి ఆర్ రాష్ట్ర సహాయ కార్యదర్శి టి ఈశ్వర్, సిపిఐ నాయకులు సిద్దిగాల్ల శ్రీనివాసులు, సిపిఐ ఎం ఎల్ రెడ్ స్టార్ సుధీర్,కాంగ్రెస్ కిసాన్ సెల్ చెన్నకృశ్న,ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోటేశ్వర్ రావు మాట్లాడారు.
    తెలంగాణకు.. చెక్​ పెట్టండి..
    రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తి చేయాలని, తెలంగాణలో అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం తక్షణం నిలుపుదల చేయాలని, నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ జల విద్యుత్తు ఉత్పత్తిని ఆపాలని, శ్రీశైలం ప్రాజెక్టు ను బహుళార్థసాధక ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం గెజిట్లో ప్రచురించాలని, కృష్ణానది యాజమాన్య బోర్డు పరిధిని నిర్ణయించి,సిఐఎఫ్ బలగాలచే ప్రాజెక్టులకు రక్షణ కల్పిస్తూ బచావత్ ట్రిబ్యునల్ నీటి కేటాయింపులకు అనుగుణంగా నీటి వినియోగం జరిగేటట్లు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని,రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ప్రకాశం జిల్లా టిడిపి ఎమ్మెల్యేల లేఖపై చంద్రబాబు వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా,కరువు వలసలు ఆత్మహత్యల నుండి విముక్తి చేసి,మాన, ప్రాణాలకు రక్షణ కల్పించాలని,గాలేరు-నగరి రెండో దశ కాలువ నుండి హంద్రీనీవా రెండో దశ ద్వారా రాయచోటి నియోజకవర్గానికి తాగు నీరు,సాగునీరు అందించేందుకు పంట కాలువల నిర్మాణం పూర్తి చేయాలని తీర్మానం చేశారు. సమావేశంలో రైతు సంఘం నాయకులు రాజగోపాల్ రెడ్డి,శంకర్ రెడ్డి,గంగయ్య, ఏఐఎస్ఎఫ్ నాయకులు లవ కుమార్,రజక సంఘం నాయకులు రమేష్, ఓపిడిఆర్ శ్రీనివాసులు,స్వర్ణకారుల సంఘం అక్బర్ ఆలీ పాల్గొన్నారు.

About Author