PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఐసిడిఎస్ కార్యాలయాన్ని మార్చ కుండా చూడండి

1 min read

– ఎమ్మెల్యేకు కి వినతి పత్రం అందజేసిన అంగన్వాడి కార్యకర్తలు
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : ఐసిడిఎస్ కార్యాలయం విభజన లో భాగంగా కడప బాలాజీ నగర్ నందు ఉన్న ఐసిడిఎస్ గ్రామీణ కార్యాలయాన్ని, చింత కొమ్మదిన్నె మండలానికి మార్చకుండా చూడాలని మండల అంగన్వాడి కార్యకర్తలు, ఆయాలు సోమవారం ఎంపీపీ కార్యాలయంలో ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్ కి ముందుగా వినతి పత్రాన్ని అందజేశారు, ఈ సందర్భంగా వారు ఎంపీపీకి వినతి పత్రం ద్వారా తెలియజేస్తూ, కడప గ్రామీణ కార్యాలయం కింద ఐదు మండలాలకు సంబంధించిన అంగన్వాడి కేంద్రాలు ఉన్నాయని తెలిపారు, వాటిలో చెన్నూరు, వల్లూరు, చింతకొమ్మదిన్నె, కాజీపేట, పెండ్లిమర్రి మండలాలు పనిచేస్తున్నాయని వారు ఎంపీపీకి తెలియజేశారు, అయితే ఈ మండలాలకు సంబంధించి విభజన జరిగిందని, ఇందులో భాగంగా కడపలో ఉండే కార్యాలయాన్ని చింతకొమ్మదిన్నె మండలానికి మార్చవలసిందిగా డిపార్ట్మెంట్ నుండి ఆదేశాలు అందాయని వారు ఆ వినతి పత్రంలో పేర్కొనడం జరిగింది, కాగా కడప బాలాజీ నగర్ రూరల్ పరిధిలో ఉండే కార్యాలయాన్ని చింత కొమ్మ దీన్నేకు మార్చిన యెడల అక్కడ మీటింగ్ లకు వెళ్లి రావడానికి మహిళలమైన మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయని వారు తెలియజేశారు, కాబట్టి మహిళలమైన మా పట్ల హృదయంతో కడప గ్రామీణ ఐసిడిఎస్ కార్యాలయాన్ని అక్కడే ఉండే విధంగా చింతకొమ్మదిన్నెకు మార్చకుండా చర్యలు చేపట్టాలని అదేవిధంగా ఈ ఈ విషయంపై అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని వారు ఎంపీపీ కి విజ్ఞప్తి చేశారు, అనంతరం ఎంపీపీ ఈ విషయాన్ని ఎమ్మెల్యే పోచం రెడ్డి రవీంద్రనాథ రెడ్డికి దృష్టికి తీసుకెళ్లి, అంగన్వాడి, ఆయాలతో మాట్లాడించడం జరిగింది కాగా ఈ విషయమై అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తామని వారికి ఎమ్మెల్యే హామీ ఇవ్వడం జరిగింది, ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.

About Author