వాట్సాప్ నుంచి మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఇలా చెక్ చేసుకోండి
1 min readపల్లెవెలుగువెబ్ : ప్రముఖ సోషల్ మీడియా సంస్థ వాట్సాప్ మెసేజ్ సర్వీసులే కాకుండా.. ఆర్థిక సేవల్ని కూడ అందిస్తోంది. వాట్సాప్ నుంచి డబ్బు బదిలీ చేయడంతో పాటు బ్యాంకు ఖాతా బ్యాలెన్స్ చెక్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తోంది. బ్యాంకు నుంచి బ్యాంకుకి డబ్బు బదిలీ చేసేందుకు వాట్సాప్ యూపీఐ సిస్టమ్‌ని ఉపయోగించుకుంటుంది. ఇది గూగుల్‌పే, ఫోన్‌పే మాదిరిగానే పనిచేస్తుంది. ఫోన్ నంబర్ సాయంతో బ్యాంకు వివరాలను గుర్తిస్తుంది. అందువల్ల వ్యాట్సాప్ పేమెంట్ సిస్టమ్ సేవలు పొందాలంటే ముందుగా మీ బ్యాంకు ఖాతాకు మొబైల్ నంబర్‌ను అనుసంధానించాలి. అలాగే మీ వాట్సాప్ యూపీఐ పేకి బ్యాంకు ఖాతాను రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది.
- ముందుగా వాట్సాప్‌ను తెరిచి మీరు ఆండ్రాయిడ్ డివైజ్‌ను ఉపయోగిస్తుంటే మోర్ ఆప్షన్‌లోకి.. ఐఫోన్ యూజర్లు సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి.
- అక్కడ అందుబాటులో ఉన్న పేమెంట్స్ ఆప్షన్‌పై ట్యాప్ చేయాలి.
- పేమెంట్స్ మెథడ్‌లో బ్యాంకు అకౌంట్‌ను క్లిక్ చేసి వ్యూ అకౌంట్ బ్యాలెన్స్‌పై క్లిక్ చేయాలి.
- ఆపై యూపీఐ పిన్ ఎంటర్ చేసి బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.