NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘చేనేత విజయభేరి’ని జయప్రదం చేద్దాం

1 min read

– శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు ఆశా సురేష్

పల్లెవెలుగు:2024 జనవరి 21న రాష్ట్రస్థాయిలో నిర్వహించే చేనేత విజయభేరి కార్యక్రమానికి జయ ప్రదం చేయాలని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు ఆశా సురేష్, సోమ గోపాల్ , జక్కా సుధాకర్ పిలుపునిచ్చారు. గురువారం  బుచ్చిరెడ్డిపాలెం లో గల చెన్నూరు గ్రామ చేనేత కుటుంబాలతో చేనేత విజయభేరి మహాసభ కార్యాచరణలో భాగంగా  సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ చేనేతలు ఆర్థికంగా.. రాజకీయంగా.. సామాజికంగా ఎదగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. చేనేతల ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం చేనేత విజయభేరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, రాష్ట్రంలోని ప్రతి చేనేత కుటుంబ సభ్యులు సభకు హాజరై జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో వనం శేషయ్య, సోమ సురేష్ , ఇష్టం శెట్టి మల్లికార్జున, వనం కిష్టయ్య, జంజం వినోద్, జంజం శ్రీనివాసులు , వనం వెంకటేశ్వర్లు, ఇష్టం శెట్టి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

About Author