‘చేనేతపురి’లో.. బుట్టా మార్క్..!
1 min readవైఎస్ కుటుంబానికి విధేయురాలు
- నియోజకవర్గ ప్రజలకు ఆత్మీయురాలు..
- నిత్యం ప్రజా సేవలోనే… నిమగ్నం..
- ఎమ్మిగనూరు అభివృద్ధే ఎజెండా
- మాజీ ఎంపీ, బుట్టారేణుక
ఎమ్మిగనూరు, పల్లెవెలుగు: వైఎస్ కుటుంబానికి విధేయురాలు.. కర్నూలు జిల్లా ప్రజలకు ఆత్మీయురాలైన మాజీ ఎంపీ, ఎమ్మిగనూరు అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి బుట్టారేణుక…. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో తన ప్రత్యేకతను చాటుకుంటోంది. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి వెళ్లి…. ఇంటిలోని ప్రతి మనిషిని అప్యాయంగా పలకరిస్తూ… తనకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ఎమ్మిగనూరు అభివృద్ధే అజెండాగా పెట్టుకున్న ఆమె… చేనేతపురిలో వైసీపీ జెండా ఎగరవేస్తానని ధీమా వ్యక్తం చేశారు.
బుట్టాకు… బ్రహ్మరథం..:
నియోజకవర్గ కేంద్రమైన ఎమ్మిగనూరు, రూరల్, గోనెగండ్ల, నందవరం మండలాల్లోని ప్రతి గ్రామంలో ప్రచారానికి వెళ్లిన ఆమెకు ప్రజలకు బ్రహ్మరథం పడుతున్నారు. మాజీ ఎంపీగా జిల్లాలో ఆమె చేసిన సేవలు… బుట్టా ఫౌండేషన్ ద్వారా కొనసాగుతున్న సేవా కార్యక్రమాలు ప్రజల మనసులో పాతుకుపోయ్యాయి. ఆమె ఏ గ్రామానికి ప్రచారానికి వెళ్తుందో… అక్కడ హోరెత్తిపోతోంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
ప్రజా సేవలోనే…:
2014లో ఎంపీగా గెలిచిన ఆమె.. నిత్యం ప్రజా సేవలోనే ఉన్నారు. ఆ నమ్మకంతోనే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2024 సార్వత్రిక ఎన్నికల బరిలో నిలబెట్టారు. చేనేతపురి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ… సేవ చేసేందుకు తాను పోటీలో నిలబెట్టానని, తనను గెలిపిస్తే ఎమ్మిగనూరును మరింత అభివృద్ధి చేస్తానని ఆమె ప్రజలకు హామీ ఇస్తున్నారు.
మళ్లీ జగనన్నే…సీఎం…:
రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన గురించి ప్రజలకు వివరిస్తూ…. ఇలాంటి సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలోనూ అమలు కావడంలేదని ప్రజలకు వెల్లడిస్తున్నారు. ఒక్క జగనన్న తోనే సంక్షేమ పథకాలు సాధ్యమని… మళ్లీ మనం జగనన్నను ముఖ్యమంత్రి చేయాలని కోరారు. ఇందులో భాగంగా జగనన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు సమానమైన పరిపాలన అందిస్తున్నారని తెలియజేశారు.
కూటమికి…ఓటమి భయం..:
కూటమి అభ్యర్థి జయనాగేశ్వర రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని, అందుకే వైసీపీ పాలనపై దుష్ప్రచారం చేస్తున్నారని, ఆయన మాటలు పట్టించుకోవద్దని ప్రజలకు వెల్లడిస్తున్నారు. సీఎం జగనన్న పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందిందని, కానీ కూటమి అభ్యర్థి అభివృద్ధి జరగలేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వాస్తవాలు గ్రహించి ఓటు వేయాలని ప్రజలు కోరారు. ఫ్యాన్ గుర్తుక ఓటు వేసి గెలిపించాలని నియోజకవర్గ ప్రజలను వైసీపీ అభ్యర్థి బుట్టారేణుక అభ్యర్థించారు.