చెన్నై యువతి, బంగ్లాదేశ్ మహిళ వివాహం !
1 min readపల్లెవెలుగువెబ్ : తాజాగా తమిళనాడుకు చెందిన ఓ యువతి, బంగ్లాదేశ్‌లోని హిందూ కుటుంబానికి చెందిన యువతిని పెళ్లి చేసుకుంది. తమిళనాడు సంప్రదాయ బ్రాహ్మణ వివాహ పద్ధతిలో గత నెల 31న జరిగిన ఈ పెళ్లి విషయం తాజాగా వెలుగు చూసింది. తమిళనాడులోని మదురైకి చెందిన సుబ్రమణి కుటుంబం కెనడాలోని కల్గరీలో స్థిరపడింది. ఆయన కుమార్తె సుభిక్ష సుబ్రమణికి బంగ్లాదేశ్ హిందూ కుటుంబానికి చెందిన టీనా దాస్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. టీనా కుటుంబం కూడా కల్గరీలోనే ఉంటోంది. 19 ఏళ్ల వయసున్నప్పుడే సుభిక్ష ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. టీనాను పెళ్లాడతానని స్పష్టం చేసింది. అందుకు వారు అంగీకరించలేదు. చివరికి తల్లిదండ్రులతో ఆరేళ్ల పోరాటం తర్వాత ఇరు కుటుంబాల అంగీకారంతో చెన్నైలో గత నెల 31న వీరి వివాహం జరిగింది.