చెన్నూరూ పీ హెచ్ సి ని యధావిధిగా కొనసాగించండి
1 min read– ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: మండల సచివాలయలపరిధిలో ఉండే ఆరోగ్య ఉప కేంద్రాలలో, అలాగే సచివాలయాలలో ప్రజలకు వైద్య సదుపాయాలు బాగున్నాయని, అయితే తమకు అందిన సమాచారం ప్రకారం గుర్రంపాడు ,రామనపల్లి, ఉప్పరపల్లి, శివాల పల్లి గ్రామాల సచివాలయ పరిధిలోని గ్రామాలను కడప టౌన్ లో గల అక్కాయ పల్లి పి హెచ్ సి కి తరలించడం జరుగుతుందని, అలా చేయడం వల్ల గ్రామీణ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికాక తప్పదని ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్, ఎంపీటీసీలు , అలాగే సర్పంచులు డి ఎం హెచ్ ఓ నాగరాజు, అడిషనల్ ఉమామహేశ్వరరావు లకు వినతి పత్రం అందజేశారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చెన్నూరు పిహెచ్సి కి సంబంధించిన ఈ నాలుగు గ్రామాల ఆరోగ్య సిబ్బంది, కడప టౌన్ అక్కాయ పల్లెకు పోవాలంటే 12 కిలోమీటర్లు వెళ్లాల్సి ఉంటుందని, అంతే కాకుండా వ్యాక్సిన్ ఎలాంటి రవాణా సౌకర్యం కూడా ఉండదని సీఎంహెచ్వో కు తెలియజేశారు, ఇలాంటి తరుణంలో అక్కడికి తరలించడం భావ్యం కాదని, తమరు పెద్ద మనసుతో ఇక్కడి ప్రజల, వైద్య సిబ్బందిని దృష్టిలో ఉంచుకుని పిహెచ్సి ని తరలించొద్దని వారు టీఎంహెచ్వో కు, అడిషనల్ డీఎంహెచ్ఓ కు వినతి పత్రం అందజేశారు.. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు, సర్పంచ్ లు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.