టిడిపి పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా చెర్ల కొత్తూరు పుల్లయ్య చౌదరి ఎన్నిక
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో సాంస్కృతిక విభాగం అధ్యక్షులు పి హనుమంతరావు చౌదరి,ఆధ్వర్యంలో, తెలుగుదేశం పార్టీ జిల్లా, ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన చెర్ల కొత్తూరు పుల్లయ్య చౌదరిని, సన్మానించిన హనుమంతరావు చౌదరి, తెలుగుదేశం పార్టీజిల్లా అధ్యక్షుడు తిక్క రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ బీటీ నాయుడు కూడా చైర్మన్ శోమిశెట్టి వెంకటేశ్వర్లు,రాష్ట్ర కార్యదర్శి నాగేశ్వర యాదవ్, జేమ్స్, బొమ్మిరెడ్డి పల్లె సుబ్బరాయుడు నంద్యాల నాగేంద్ర,ప్రసాదు, భాష,మొదలగు నాయకుల,ఆధ్వర్యంలో చర్ల కొత్తూరు పుల్లయ్యచౌదరి ని సన్మానించడం జరిగింది. పార్టీలో కష్టపడి పనిచేసే వారికి ఎప్పటికైనా గుర్తింపు ఉంటుందని ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రినారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తో కలిసి పనిచేయాలని చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు తెలియజేయాలని ప్రజలతో మమేకమై కలసి మెలసి ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క కార్యకర్త తెలుగుదేశం పార్టీ కి పనిచేయాలని అన్నారు.