PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చదరంగం వలన జ్ఞాపకశక్తి, చురుకుదనం, క్రమశిక్షణ అలవాడతాయి..

1 min read

రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్పర్సన్ పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి

ఉత్సాహంగా, కన్నుల పండుగ గా రాష్ట్రస్థాయి చదరంగం పోటీలు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఆంధ్ర చెస్ అసోసియేషన్, ఏలూరు చెస్ అసోసియేషన్ సహకారంతో ఏజీ సిఏ, ఎంకెటిజే ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్ర ఓపెన్ ర్యాపిడ్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ వట్లూరు సిద్ధార్థ క్వీస్ట్ స్కూల్లో శుక్రవారం  ఉత్సాహంగా, కన్నుల పండుగగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ పి ళ్లoగోళ్ళ శ్రీలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చదరంగం వలన జ్ఞాపకశక్తి, చురుకుదనం, క్రమశిక్షణ అలవాడతాయన్నారు. ఈ పోటీలకు పలు జిల్లాల నుంచి 192 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. గెలుపొందిన విజేతలకు పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ పోటీలలో టి లక్ష్మణరావు, అభిరామ్, ఎల్ మౌళి, ఎం బాల శ్రీనివాసరావు, సిహెచ్ వివేక్, ఎల్ శ్రీనివాసరావు, ఎం అరవిందబాబు, గంజి అరుణకుమారి, హరీష్, ఎన్ వినయ్, బాలు, జాతీయ పోటీలకు అర్హత సాధించారని అకాడమీ డైరెక్టర్ జి యోహాను తెలిపారు. స్కూల్ వీటికె సిద్ధార్థ కృష్ణ, వంశీకృష్ణ, వై మహేష్, కనకలక్ష్మి ,అరుణ, పి కిరణ్ కుమార్ తదితరులు పరివేక్షించారు.

About Author