ముగిసిన చెట్నహల్లి శ్రీ భీరప్ప స్వామి దేవర
1 min read
మంత్రాలయం , న్యూస్ నేడు: మండల పరిధిలోని చెట్నీహళ్లి గ్రామంలో వెలసిన శ్రీ భీరలింగేశ్వర స్వామి దేవరను ఆలయ పూజార్ల ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా ముగిశాయి. ఇందులో భాగంగా తెల్లవారుజామున నుంచి చెట్నీహళ్లి గ్రామానికి చెందిన అళ్లింగప్ప, పెద్దకడుబూరు మండలం కల్లుకుంట గ్రామానికి చెందిన యాతగిరప్ప, ఎమ్మిగనూరు మండలం మసీదుపురం గ్రామానికి చెందిన వన్నికెరప్ప స్వామి వార్ల భీరప్ప దేవాలయం కొలవై ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం తమ గ్రామాలకు చెందిన పల్లకిలు డోలు, మోళ తాళాలు, నృత్యాలు,పిల్లనగ్రోవి లతో అత్యంత భక్తి శ్రద్దలతో సాగనంపారు. భక్తులు తమ మొక్కులు చెల్లించు కోవడానికి భారిగా భక్తులు తరలివచ్చారు. దీంతో భీరప్ప ఆలయం భక్తులతో కిటకిట లాడింది.
