NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చియాన్ విక్ర‌మ్ కు గుండెపోటు

1 min read

Vikram has been admitted to a hospital in Chennai. File photo

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌్ర‌ముఖ స్టార్ హీరో చియాన్ విక్రమ్‌కు గుండె పోటు గుర‌య్యారు. దీంతో హుటాహుటిన ఆయనను చెన్నై కావేరీ ఆసుపత్రికి తరలించి ఐసీయూలో జాయిన్ చేశారు. తమిళంలో ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించిన ఆయన తాజాగా ‘కోబ్రా’ అనే మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ క్రమంలో ఆయనకి హార్ట్ ఎటాక్ రావడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు సమాచారం అందుతోంది. నిజానికి ఆయనకి గుండె పోటు రాలేదని, హైఫీవర్ తో బాధపడుతున్నారని అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సినీ క్రిటిక్ రమేశ్ బాలా ట్వీట్ చేశారు. అలాగే.. కొద్ది నిమిషాల క్రితం విక్రమ్ కావేరీ ఆసుపత్రి నుంచి డిస్చార్జ్ అయినట్టు సమాచారం అందింది. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

                                              

About Author