NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చ‌రిత్ర సృష్టించిన చికెన్.. ఆల్ టైం గ‌రిష్ఠ ధ‌ర ఇదే !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : చికెన్‌ ధర ఆల్‌టైమ్‌ రికార్డు నమోదు చేసింది. పౌల్ట్రీ చరిత్రలో ఎన్నడూ లేని విధింగా హోల్‌సేల్‌ మార్కెట్‌లో బాయిలర్‌ చికెన్‌ కిలో రూ.312కు చేరింది. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ అనంతరం చికెన్‌ రికార్డు స్థాయి ధరలను నమోదు చేసింది. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ కారణంగా చికెన్‌ వైపు వినియోగదారుల అంతగా మొగ్గు చూపలేదు. ఓ దశలో స్కిన్‌లెస్‌ చికెన్‌ కిలో రూ.80 దిగివచ్చింది. అయితే సెకండ్‌ వేవ్‌ తగ్గిన అనంతరం చికెన్‌ ధర పెరుగుతూ వచ్చింది. ఓ దశలో కిలో రూ.280కి చేరి ఆల్‌టైం రికార్డును నెలకొల్పింది. తరువాత ఆ రికార్డులను అధిగమించే ఏకంగా రూ.312కు చేరింది. ఈ ఏడాది ఆరంభం నుంచి చికెన్‌ ధర కిలో రూ.200 మార్కును దిగకుండా కొనసాగుతోంది. ఈ ఏడాది జనవరి 1న రూ.214 వద్ద నిలకడగా ఉన్న ధర మార్చి 1 నాటికి రూ.280కి ఎగబాకింది. అనంతరం కొద్దిపాటి తగ్గుదల నమోదవుతూ వచ్చిన మే 1వ తేదీ నుంచి ధరల పెరుగుదల రికార్డు స్థాయికి చేరింది. మే 1వ తేదీ రూ.228గా ఉన్న కిలో స్కిన్‌లెస్‌ ధర మే 12వ తేదీ నాటికి రూ.312కు ఎగబాకి ఆల్‌టైం రికార్డు సృష్టించింది.

                               

About Author