PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆకాశాన్నంటిన చికెన్ ధ‌ర !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : చికెన్‌ ధర ఆల్‌టైమ్‌ రికార్డు స్థాయికి చేరుకుంది. మార్కెట్‌లో స్కిన్‌లెస్ చికెన్‌ కిలో ధర రూ.312గా నిర్ణయించారు. కోళ్ల పరిశ్రమ వద్ద ఉన్న రికార్డుల ప్రకారం ఇప్పటివరకూ గరిష్ఠ ధర రూ.290. ఇప్పుడు దాన్ని కూడా దాటేసి కొత్త రికార్డులు సృష్టిస్తూ సాగుతోంది. మే నెల ఒకటో తేదీన రూ.238 ఉన్న చికెన్‌.. పది రోజుల్లోనే రూ.74 పెరిగి రూ.312కి చేరుకుంది. రానున్న రెండు, మూడు రోజుల్లో ధరలు మరింత పెరుగుతాయని వ్యాపారులు అంటున్నారు. మార్కెట్‌ డిమాండ్‌కు సరిపడినంత చికెన్‌ లేనందున పది రోజుల నుంచి ధరలు పెరుగుతున్నాయని చెబుతున్నారు. కిలోకు రూ.5 నుంచి రూ.10 తేడాతో దేశవ్యాప్తంగా ఇవే ధరలు ఉన్నాయంటున్నారు.

                                   

About Author