PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ముఖ్యమంత్రి జగన్ పాదయాత్రలో ఇచ్చిన వాగ్దానాన్ని విస్మరించారు..

1 min read

– ఉద్యోగులకు ఒకటో తారీకున జీతాలు అందేలా చేయాలి..
– సిపిఎస్ రద్దు చేయాలి, డి ఏ చెల్లించాలి..
– ఏపీ జెఎసి అమరావతి డిమాండ్..
పల్లెవెలుగు వెబ్​ ఏలూరు : ఉద్యోగ ఉపాద్యాయ విశ్రాంతి ఉద్యోగుల పొరుగు సేవలు మరియు కాంట్రాక్టు ఉద్యోగుల, గ్రామ వార్డ్ సచివాలయ ఉద్యోగుల సమస్యలు మరియు వారి డిమాండ్ ల పరిష్కారము కొరకు ఏ.పి.జె.ఏ.సి అమరావతి రాష్ట్ర కమిటీ నిర్ణయం ప్రకారం ఉద్యమ కార్యాచరణ లో భాగంగా గురువారం ఏలూరు జిల్లా కలక్టర్ కార్యాలయము వద్ద దర్న చేయుటకు పిలుపునివ్వగా పెద్ద ఎత్తున CPS ఉద్యోగలు స్వచ్చందముగా పాల్గొని ఈ దర్న కార్యక్రమమును జయప్రదము చేసారని తెలిపారు, ఉద్యోగులకు ప్రతి నెల 1 వ తేదీనే జీతములు చెల్లించవలెనని మరియు 01.01.2022 నుండి ఇవ్వవలసిన DA చెల్లించవలెనని, CPS రద్దు చెయ్యాలని మరియు అనేక ఆర్ధిక ఆర్దికేతర డిమాండ్ లను పరిష్కరించాలని జిల్లా చైర్మన్ కె. రమేష్ కుమార్ ఆద్వర్యములో ఏలూరు కలక్టరేట్ వద్ద దర్న నిర్వహించారు. ఈ దర్న లో జిల్లా చైర్మన్ కె. రమేష్ కుమార్ మట్లాడుతూ – “మాట ఇచ్చి – మడము తిప్పిన జగన్” – ఉద్యోగులకు జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హమిలలో ఏ ఒక్కటి నెరవేర్చలేదని, పాదయాత్రలో ప్రభుత్వము ఏర్పడిన వారం రోజులలో CPS రద్దు చేస్తానని మాటయిచ్చి, 4 సంవత్సరములు గడుస్తున్నప్పటికి CPS రద్దు ఉసే ఎత్తడం లేదని, ఉద్యోగులు, ఉపాద్యాయులు తీవ్రమైన ఆందోళన చెందుతున్నారని, ప్రభుత్వ పథకముల అమలులో ఉద్యోగి యొక్క పాత్ర అత్యంత కీలకమైనదని, లబ్దిదారుని ఎంపిక నుండి పథకము యొక్క లబ్ది అతనికి చేరే వరకు అత్యంత భాద్యతతో వ్యవహరిస్తూ ప్రభుత్వ పథకములను మరియు నవరత్నలను క్షేత్ర స్థాయిలో అత్యంత పారదర్శకతతో అమలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వము ఉద్యోగులను పట్టించుకోవడము లేదని అదేవిధముగా విద్యార్ధులకు విధ్యను బోధించుటలోను అత్యంత ప్రతిష్టత్మకమైన “నాడు – నేడు” అమలులోనూ కృషి చేయుచున్న ఉపాద్యాయులను విష్మరించారని మరియు 5 రాష్ట్రాలలో (రాజస్తాన్, జార్ఖండ్ , చతీసగడ్, పంజాబ్ , హిమాచల్ ప్రదేశ్) రాష్ట్రాలలో CPS ను రద్దు చేసారని, అదేవిధముగా అనేక రాష్ట్రములు ఆ దిశగా అడుగులు వేస్తున్నారని, కాని ఈ ప్రభుత్వమూ మ్యాన్ ఫెస్టో లో పెట్టి వారం రోజులలో CPS ను రద్దు చేస్తామని చెప్పి, 4 సంవత్సరములు గడిచిననూ అమలు చెయ్యడము లేదని, కావున CPS ఉద్యోగలు పరిస్థితి ఇలాగె కొనసాగితే ఉద్యమం ఇంకా తీవ్రతరం అవుతుందని రానున్న కాలములో ఉద్యమము నడిపించడానికి నాయకులు అవసరము లేకుండా ఎవరికీ వారే ఒక నాయకుడిగా ముందుకి వచ్చి ఉద్యమము చేసే పరిస్థితి కనబడుతుందని, కావున ఇప్పటికైనా ప్రభుత్వము స్పందించి APJAC అమరావతి పక్షమున ప్రభుత్వము ముందు ఉంచిన వివిధ రకముల డిమాండ్ లను వెంటనే పరిష్కరించాలని తెలియజేసారు. ఈ కార్యక్రమములో APJAC అమరావతి జనరల్ సెక్రెటరీ B.రాంబాబు చైర్మన్, మరియు ఈ రోజు జరిగిన దర్న కు సంఘిభావముగా MLC, షేక్ షాబ్జి మరియు APNGOs నాయకులు చోడగిరి శ్రీనివాస్, JAC రాష్ట్ర నాయకులు ఆర్.ఎస్. హరినాద్, మరియు కప్పల సత్యనారాయణ, జిల్లా ఇంజనీర్స్ అసోసియేషన్ నాయకులు వర్మ , ఏ ప్రమోద్ కుమార్, రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్, జిల్లా కార్యదర్శి, డ్రైవర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు వేణు, APJAC అమరావతి కో చైర్మన్ వర్మ, పంచాయితి రాజ్ ఇంజనీర్ జిల్లా కార్యదర్శి ఆర్. వీరబాబు, కోశాధికారి, ఆర్. శ్రీకాంత్, కో ఆపరేటివ్ డిపార్టుమెంటు నాయకులు ప్రభాకరరావు మరియు మహాలక్ష్మి పెన్షనర్స్ అస్సోసియేషన్ జిల్లా కార్యదర్శి మరియు పెన్షనర్లు మరియు APJAC అమరావతి సభ్య సంఘ నాయకులూ మరియు వివిధ సంఘాల నాయకులు మరియు ఉద్యోగులు పాల్గొన్నారు.

About Author