PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రజా పాలకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్

1 min read

పింఛన్ల పంపిణీలో వైసీపీ ప్రభుత్వంలోనే విప్లవాత్మక మార్పులు.

రాజకీయాలకు అతీతంగా అర్హులకు సంక్షేమ పథకాలు.

అవ్వాతాతల కళ్లల్లో వెల్లివిరిసిన ఆనందం.

 కొత్తగా మంజూరైన లబ్దిదారులకు పెన్షన్‌ పత్రాల అందజేసిన వైస్ చైర్మన్ రబ్బానీ.

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ వైసీపీ ప్రభుత్వంలో  సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రజా పాలకుడు సీఎం జగన్న మాత్రమేనని నందికొట్కూరు మున్సిపల్ వైస్ చైర్మన్ మొల్ల మహబూబ్ రబ్బానీ అన్నారు.నూతన సంవత్సరం నందికొట్కూరు మున్సిపాలిటీలో  పింఛన్ల పంపిణీ పండుగలా మొదలైంది. తాజాగా పెంచిన మొత్తంతో కలిపి రూ.మూడు వేల చొప్పున ఈనెల పింఛను డబ్బులు అందుకున్న అవ్వాతాతల కళ్లలో ఆనందం వెల్లివిరిసింది. ఇప్పటివరకూ ప్రతినెలా ఇచ్చే రూ.2,750 పెన్షన్‌ మొత్తాన్ని ఈ జనవరి ఒకటి నుంచి  మూడు వేలకు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం మున్సిపల్ వైస్ చైర్మన్ మొల్ల మహబూబ్ రబ్బానీ, కౌన్సిలర్ మొల్ల జాకీర్ హుసేన్ లు   కొత్తగా పింఛన్లు మంజూరైన లబ్దిదారులకు మంజూరు పత్రాలను అందజేసి ముఖ్యమంత్రి సందేశాన్ని వినిపించారు. వలంటీర్లు కూడా ఇళ్ల వద్దకే వెళ్లి పింఛను డబ్బులు అందజేయాలని సూచించారు. ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ పింఛన్ల పంపిణీలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారన్నారు గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అర్హత ఉన్నా పింఛన్ల మంజూరుకు అప్పటి జన్మభూమి కమిటీ సభ్యులు ఇబ్బందులు పెట్టడాన్ని స్వయంగా తెలుసుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాను అధికారంలోకి వచ్చిన వెంటనే అవ్వాతాతల పట్ల మానవత్వాన్ని కనబరుస్తూ పింఛన్ల పంపిణీలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాటను పూర్తిగా నిలబెట్టుకుంటూ పెన్షన్‌ మొత్తాన్ని ఏటేటా పెంచుకుంటూ ఈ జనవరి నుంచి రూ.మూడువేల చొప్పున ఇచ్చేందుకు నిర్ణయించారు. అలాగే తెలుగుదేశం నాయకులు అభివృద్ధి జరగలేదంటూ తప్పుడు ప్రచారాలు చేయడం తగదన్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాలలో సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు ఆరోగ్య కేంద్రాలు,  సిసి రోడ్లు, మురుగునీటి కాలువలు, నాడు నేడు కింద ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వ పాఠశాలలకు దీటుగా రూపొందించామన్నారు. తెలుగుదేశం నాయకుల వలె జన్మభూమి కమిటీల ద్వారా వారి కార్యకర్తలకు మాత్రమే అభివృద్ధి సంక్షేమ పథకాలు అందజేశారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో  రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ అభివృద్ధి పథకాలు అందిస్తున్నామన్నారు. పాలకుడు అంటే ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చాలని ఇచ్చిన మాట నెరవేర్చిన ప్రజాపాలకుడిగా సీఎం జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోయారన్నారు.ప్రతిపక్ష పార్టీలు ఇస్తున్న అబద్ధ హామీలను నమ్మకుండా ఇచ్చిన హామీలను  నెరవేర్చి ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయని పాలన సాగించిన సీఎం జగనన్నను ప్రతి ఒక్కరు   ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు ముజీబ్,వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ పసుల శ్రీనివాసులు నాయుడు, ఇమ్రాన్, సచివాలయ సిబ్బంది, వాలంటీర్స్  పాల్గొన్నారు.

About Author