PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రైతుల ద్రోహి ముఖ్యమంత్రి వైఎస్ జగన్

1 min read

– ప్రభుత్వ వైఫల్యం ఆయకట్టు రైతులకు శాపం

– కేసీ కెనాల్ కు నీరు విడుదల చేయాలి

– టిడిపి ఆధ్వర్యంలో మల్యాల హంద్రీనీవా పథకం వద్ద భారీ ధర్నా.

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు : నందికొట్కూరు  నియోజకవర్గంలోని కె సి కెనాల్ ఆయకట్టుకు ఈ ఖరీఫ్ లో  నీటి విడుదల చేయకపోవడంతో రైతుల పరిస్థితి అగమ్య గోచరమే అనే విధముగా ఉందని వెంటనే కేసీ కెనాల్ కు హంద్రీనీవా ప్రాజెక్టు నుండి నీరు విడుదల చేయాలని కోరుతూ మల్యాల హంద్రీనీవా ప్రాజెక్టు వద్ద టిడిపి నంద్యాల పార్లమెంట్ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి, గౌరు  వెంకట్ రెడ్డి రైతులతో కలిసి సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీ కెనాల్ కింద రైతాంగం చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని నీరు లేక మొక్కజొన్న, మినుము, కంది, వివిధ రకాల పంటలు తీవ్రంగా నష్టపోయే విధంగా ఉన్నావని అన్నారు. రైతులను పట్టించుకునే నాధుడు కరువయ్యారని తెలిపారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ 865 అడుగులు మీరు ఉన్నప్పటికీ ఇంతవరకు విడుదల చేయకపోవడం చాలా బాధాకర విషయం  అన్నారు. 835 వరకు నీటి వాటాను ఉపయోగించుకునేందుకు మనకు వీలుగా ఉన్నప్పటికీ ఇంతవరకు నీరు విడుదల చేయకపోవడం రైతుల పాలిట శాపం గా మారిందని తెలిపారు.ఈ ప్రభుత్వం లేనిపోని మాటలు చెప్పి కాలయాపన చేస్తుంది తప్ప రైతులను పట్టించుకోవడం లేదని అన్నారు రైతు ప్రభుత్వం అంటూ పేరు చెప్పుకుంటూ రైతులను మోసం చేస్తుందని పేర్కొన్నారు. ముచ్చు మర్రి ఎత్తిపోతల పథకం నుండి  హంద్రీనీవా ప్రాజెక్టు నుండి నీరు విడుదల చేయకపోవడంతో రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందని అన్నారు.  రాయలసీమలో ఉన్న ప్రజాప్రతిథులు రైతులను ఏమాత్రం పట్టించకపోవడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. కేసీ కెనాల్ కు రెండు రోజుల్లోగా నీరు విడుదల చేయకపోతే ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటామని వారు హెచ్చరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాజెక్టులను గాలికి వదిలేసినారని కేవలం తాడేపల్లె క్యాంప్ ఆఫీసులో కూర్చుని బటన్ నొక్య కార్యక్రమం తప్ప ఏ పని చేయడం లేదని విమర్శించారు. నందికొట్కూరు రైతులు ఎక్కువ శాతం కేసీ కెనాల్ పరివాహ ప్రాంతం కింద ఆధారపడి జీవిస్తున్నారని నీరు పక్కన ఉన్న రైతులకు అందలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఇప్పటికైనా నాయకులు స్పందించి సకాలంలో నీరు విడుదల చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో టిడిపి ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యవర్గ సెక్రటరీ  జయసూర్య, ప్రతాపరెడ్డి, గిరీష్ రెడ్డి, పల్లె రఘునాథ్ రెడ్డి ,అల్లూరు సర్పంచ్ చిన్న నాగ   లక్ష్మయ్య,  వడ్డేమాన్ సర్పంచ్ రామచంద్రుడు, కోనేటమ్మ పల్లె సర్పంచ్  దామోదర్ రెడ్డి, మైనార్టీ నాయకులు  షకీలా అహ్మద్, మూర్తుజావలి, మండల టీడీపీ కన్వీనర్లు ఓబుల్ రెడ్డి, సురేంద్ర నాథ్ రెడ్డి , వడ్డెర మాజీ కార్పొరేషన్ చైర్మన్ దేవర్ల మురళి,బీసీ సంఘం నాయకులు  మహేష్ నాయుడు, లాయర్ జాకీర్ తదితరులు పాల్గొన్నారు.

About Author