ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా ఉండాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యం
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు: ఆరోగ్యమే మహాభాగ్యమని ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్, సర్పంచ్ తుంగ చంద్రశేఖర్ యాదవ్ లు అన్నారు, మండలంలోని కొండపేట గ్రామపంచాయతీలో జగనన్న ఆరోగ్య సురక్ష -2 కార్యక్రమంలో భాగంగా జరిగిన జగనన్న ఆరోగ్యసురక్ష కార్యక్రమం లో వారు పాల్గొన్నారు, ఈ సందర్భంగా ఎంపీపీ చీర్లసురేష్ యాదవ్, సర్పంచ్ తుంగ చంద్రశేఖర్ యాదవ్ లు మాట్లాడుతూ, జగనన్న సురక్ష కార్యక్రమం ప్రజల ఆరోగ్య సమస్యల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమ మని కొండపేట గ్రామపంచాయతీ ప్రజలు అందరు ఈ ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలుపడం జరిగింది, రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని ముఖ్యమంత్రి ధ్యేయమని తెలియజేశారు, పేదవారికి ఏదైనా జబ్బు చేసినప్పుడు వారు అప్పు సప్పు చేయకుండా వైద్య సేవలు పొందేందుకు గతంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకురావడం జరిగింది అన్నారు, అంతేకాకుండా బాలింతలు గర్భవతుల కొరకు 104, అలాగే ఏదైనా అపాయం ప్రమాదం జరిగినప్పుడు అత్యవసరం కొరకు 108 వాహనాలను వాహనాలను ఏర్పాటుచేసి పేద ప్రజలకు మెరుగైన ఉచిత వైద్యాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు, ఆయన తనయులుగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి ఐదు లక్షల రూపాయలు ఉన్న ఆరోగ్యశ్రీ పథకాన్ని 25 లక్షల రూపాయల వరకు పెంచడం జరిగిందన్నారు, దీంతో ఏదైనా పేద ప్రజలకు జబ్బు చేసినప్పుడు వారు మెరుగైన వైద్యం కొరకు ఎక్కడైనా కార్పొరేట్ ఆసుపత్రులలో వైద్యం చేయించుకునే వెసులుబాటు కల్పించడం జరిగింది అన్నారు, ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు గంగులయ్య ,మాజీ ఎంపీటీసీ విజయ భాస్కర్ రెడ్డి , డాక్టర్లు వైద్య సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.