ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా పేదలకు అండగా ఉంటున్నాం..
1 min read
రాష్ట్ర మంత్రి టీజీ భరత్
17 మందికి రూ.13,44,175 సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి టీజీ భరత్
కర్నూలు, న్యూస్ నేడు: ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేదలను ఆదుకుంటున్నామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలు నగరంలోని ఆయన కార్యాలయంలో 17 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను ఆయన అందజేశారు. మల్లెపూరి వీర నారాయణకు రూ. 27493, నాటువ వీరాంజనేయులుకు రూ.75,000, ఉమావతి అనే మహిళ కూతురికి రూ.71,922, ఇండ్ల వెంకటరామయ్యకు రూ.32,324, నాగరకట్ట అబీదా బీకి రూ.81,000, వడ్ల యశోదకు రూ. 48,000, వి. ప్రసాద్‌కు రూ.23,420, ఏ.శోభారాణికి రూ.1,22,403, యం. హారిక రెడ్డికి రూ.52,833, షేక్ సుఫియాన్‌కి రూ.21,316, మరాఠి షిండే శ్రీనివాస రావుకి రూ.30,000, కనీజ్ ఫాతీమాకి రూ.1,27,786, పింజరి బషీర్ అహ్మద్‌కి రూ.50,933, నారా లీలావతికి రూ.2,30,000, అడ్డేకుల శాంతారాజుకి రూ.29,162, జూటూరు పరమేశ్వరప్పకి రూ.1,20,583, పి. వెంకట సుబ్బయ్యకి రూ. 2,00,000ల చెక్కులను మంత్రి టీజీ భరత్ బాదితులకు అందజేశారు. మొత్తం రూ.13,44,175ల చెక్కులు అందించినట్లు వివరాలు తెలిపారు. ఆపద సమయంలో నియోజకవర్గ ప్రజలను ఆదుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మంత్రి టీజీ భరత్ కృతజ్నతలు తెలిపారు. చెక్కులు అందుకున్న వారు సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి టీజీ భరత్ ల మేలు మరిచిపోలేమని సంతోషం వ్యక్తం చేశారు.