NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: పేద ప్రజల చెంతకు కార్పొరేట్ వైద్యం అందించడం ప్రభుత్వం లక్ష్యం అని నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ అన్నారు.గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పగిడ్యాల మండలం నెహ్రు నగర్ గ్రామానికి చెందిన కటకం లక్ష్మీ నారాయణ కు రూ ,1.20,000 సీఎం సహాయ నిధి నుంచి మంజూరు అయిన చెక్కును ఎమ్మెల్యే ఆర్థర్ అందజేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేయడం జరిగింది అని ఆయన గుర్తు చేశారు.సీఎం సహాయ నిధి పేద ప్రజలకు వెలుగులు నింపుతుంది అన్ని అన్నారు.ఆపదలో సీఎం సహాయ నిది ఆపద్భందువునిగా అదుకుంటుంది అని ఆయన తెలిపారు.మానవతా దృక్పథంతో సీఎం జగన్ మోహన్ రెడ్డి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఆర్దిక సహాయాన్ని మంజూరు చేస్తున్నారని అన్నారు వైద్య చికిత్స చేసుకోలేక ఆర్దిక ఇబ్బందులు పడుతున్న ఎనో కుటుంబాలకు ఈఫండ్ ఆసరాగా నిలుస్తుంది,బాధితులు అవసరమైన సమయంలలో సీఎం రిలీఫ్ ఫండ్ ను సద్వినిమెాగపర్చుకొవాలి అని తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ డైరెక్టర్ గంగిరెడ్డి రమాదేవి , వైసీపీ జిల్లా ఎస్సి విభాగం అద్యక్షులు సగినేల వెంకట రమణ , పగిడ్యాల మండల వైసీపీ నాయకులు చిట్టి రెడ్డి , జయరాం రెడ్డి , నెహ్రు నగర్ వైసీపీ నాయకులు విజయుడు, శ్రీనాథ రెడ్డి, బూషి గౌడ్, దామరాకుల.జీవన్ సుందర్ రాజు, వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author