‘ సీబీఐ పంజరంలో చిలక ’
1 min readపల్లెవెలుగు వెబ్ : కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐను ఉద్దేశించి మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. సీబీఐ పంజరంలో బంధించబడిన చిలక అని, ఎన్నికల సంఘం, కాగ్ తరహా స్వయం ప్రతిపత్తి సీబీఐకి అవసరమని హైకోర్టు సూచించింది. పార్లమెంట్ కు మాత్రమే జవాబుదారీగా ఉండే కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ మాదిరిగా సీబీఐకి స్వయంప్రతిపత్తి ఉండాలని మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది. స్వయం ప్రతిపత్తి ఉన్నప్పుడే సీబీఐ పై ప్రజలకు విశ్వాసం కలుగుతుందని హైకోర్టు తెలిపింది. తాము చేసిన 12 పాయింట్ల సూచన పంజరంలోని చిలుకను విడుదల చేయడానికేనని కోర్టు పేర్కొంది. తమిళనాడులోని పోంజి కుంభకోణం పై సీబీఐ తో దర్యాప్తు జరిపించాలని పిటిషన్ దాఖలు కావడంతో .. ఈ పిటిషన్ పై ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా మద్రాస్ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.