PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పిల్లల సంరక్షణ.. మా బాధ్యత

1 min read

– కోవిడ్ సోకిన తల్లిదండ్రుల పిల్లలకు భరోసా…
– ‘కృష్ణా జిల్లా చెల్డెలైన్​ ఆధ్వర్యంలో సంరక్షణ’

  • వాల్​పోస్టర్లు విడుదల చేసిన కలెక్టర్ పి.యండి. ఇంతియాజ్
    పల్లెవెలుగు వెబ్​, విజయవాడ: కోవిడ్​–19 బారిన పడిన తల్లిదండ్రులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నా.. హోం క్వారంటైన్​లో ఉన్నా… వారి పిల్లలకు కృష్ణా జిల్లా చెల్డెలైన్​ సొసైటీ ద్వారా పునరావాసం కల్పిస్తున్నామని కలెక్టర్​ ఏఎండీ ఇంతియాజ్​ తెలిపారు. స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో సోమవారం చెల్డెలైన్​, బాలల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్లను కలెక్టర్​ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఏ.యండి. ఇంతియాజ్ మాట్లాడుతూ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో భార్యభర్తలకు కరోనా సోకి కోవిడ్​ కేర్​ సెంటర్​, హోం ఐసోలేషన్​, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నా… వారి పిల్లలకు సొసైటీ ద్వారా తాత్కాలికంగా సంరక్షణ కల్పిస్తామన్నారు. అటువంటి వారి కోసం 181,198 నెంబర్లకు ఫోన్​ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. అదేవిధంగా తల్లిదండ్రులు కోల్పోయి అనాథలైన పిల్లలను బాలల సంరక్షణ కేంద్రాల్లో రక్షణ కల్పించి పునరావాసం కోసం చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్​ ఏఎండీ ఇంతియాజ్​ వెల్లడించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెల్డెలైన్​ నిర్వాకులు అరవ రమేష్ తెలిపారు.

About Author