PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం- సిడిపిఓ రమాదేవి

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : బాల్యవివాహాలను ప్రోత్సహించడం చట్టరీత్యా నేరమని సిడిపిఓ రమాదేవి అన్నారు, బుధవారం వారు మండల పరిషత్ సభ భవనంలో నిర్వహించిన బాల్య వివాహల నిర్మూలన పై కార్యక్రమం నిర్వహించారు, ఈ సందర్భంగా సిడిపిఓ రమాదేవి మాట్లాడుతూ, తల్లిదండ్రులు తమ బిడ్డలను చదివించకుండా చిన్న వయసులోనే వివాహాలు చేర్పించడం వల్ల వారు అనేక ఇబ్బందులకు, ఒత్తిడికి గురవుతున్నారని ఆమె తెలిపారు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో నిరక్షరాస్యత మూలంగా ఇలాంటి సంఘటనలు అనేకం జరుగుతున్నాయని వీటిని నిర్మూలించడానికి తమ వంతు బాధ్యతగా అందరూ కృషి చేయవలసి ఉంటుందని ఆమె తెలిపారు, చాలామంది తల్లిదండ్రులు అమ్మాయి పదవ తరగతి అయిపోగానే వివాహాలు చేస్తున్నట్లు తెలిసిందని, ఇలా ఇకమీదట ఎవరైనా ఇలాంటి వివాహాలు జరిపిస్తే వెంటనే 1098 కి ఫోన్ చేసి సమాచారం అందించాలని ఆమె తెలియజేశారు, అమ్మాయికి 18 సంవత్సరాలు అబ్బాయికి 20 సంవత్సరాలు 21 సంవత్సరాలు నిండిన తర్వాతనే వివాహాలు జరిపించాలని, అలా కాకుండా వివాహాలు జరిపిస్తే పెళ్లి కుమారుని తల్లిదండ్రులకు పెళ్లిలో పాల్గొన్న వారికి, వారికి సహకరించిన వారికి రెండు సంవత్సరాలు జైలు శిక్ష లక్ష రూపాయలు జరిమానా విధించడం జరుగుతుందని ఆమె తెలియజేశారు, ఈ విషయాలపై తల్లిదండ్రులకు అంగన్వాడి కేంద్రాలలో పనిచేస్తున్న కార్యకర్తలు, ఆయాలు గ్రామాలలో ఎప్పటికప్పుడు కమిటీ దృష్టికి తీసుకురావాలని ఆమె తెలియ చేశారు, ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ జి ఎన్ భాస్కర్ రెడ్డి, ఎంపీడీవో సుబ్రహ్మణ్యం శర్మ, ఎస్సై శ్రీనివాసులు రెడ్డి, డిప్యూటీ తాసిల్దార్ వెంకటరమణ, ఏ పీఎం గంగాధర్, ఐసిడిఎస్ సూపర్వైజర్ గురమ్మ, విజేత మహిళా మండలి అధ్యక్షురాలు గోసుల అరుణకుమారి, పషీర్, మహిళా పోలీస్ చంద్రకళ, తదితరులు పాల్గొన్నారు.

About Author