PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బాల్య వివాహం చట్టరీత్యా నేరం

1 min read

– అవగాహన కల్పిస్తున్న సీడీపీవో తేజేశ్వరి  – 

పల్లెవెలుగు వెబ్ చాగలమర్రి :  18సంవత్సరాలు నిండని బాలికలకు బాల్య వివాహాలు చేయడం చట్టరిత్యా నేరమని ఆర్డీవో శ్రీనివాస్, సీడీపీవో తేజేశ్వరిలు తెలిపారు. చాగలమర్రి పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం సమావేశ భవనంలో శుక్రవారం బాల్యవివాహాల నిరోదక చట్టం, బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాలపై ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాల్య వివాహాల వల్ల అనేక అనర్ధాలు సంభవిస్తున్నాయన్నారు. బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. దేశంలో ఆడపిల్లల సంఖ్య తగ్గిపోతుందన్నారు. లింగనిర్ధారణ చట్ట వ్యతిరేకమని ఆడపిల్లలు కూడా మగ పిల్లలతో పాటు సమానంగా చదివించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దారు సుభద్రమ్మ, హరినాథరావు, ఐసీడీఎస్ సూపర్వైజర్ సుశీల, ఈవోపీఆర్డి సుదర్శన్రావు, సచివాలయ జిఎమ్‌ఎస్‌కె లు,వెల్పేర్‌ లు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author