NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ముప్పై ఏళ్ల త‌ర్వాతే పిల్ల‌లు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : పట్టణ ప్రాంతాల్లో ముప్పై ఏళ్లు దాటాకే త‌ల్లి కావాల‌నుకునే మ‌హిళ‌ల‌ సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. గ్రామీణ ప్రాంతాల మహిళలు మాత్రం సగటున 25 ఏళ్లలోపే ఇద్దరు పిల్లలకు జన్మనిస్తున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని కార్పొరేట్‌ ప్రైవేటు ఆస్పత్రులకు వచ్చే ప్రతి పది మంది గర్భిణుల్లో ఐదుగురు 30 ఏళ్లు దాటిన వారే ఉంటున్నట్లు గైనకాలజిస్టులు చెబుతున్నారు. అయితే, ముస్లిం ఆడపిల్లలకు మాత్రం త్వరగా పెళ్లిళ్లు చేస్తుండడంతో.. వారు చాలా తక్కువ వయసులోనే పిల్లలకు జన్మనిస్తున్నారని హైదరాబాద్‌కు చెందిన ఓ గైనకాలజిస్టు వెల్లడించారు. లేటుగా గర్భం దాల్చుతున్న వారిలో ఎక్కువ శాతం మంది ఒక్కరితోనే సరిపెట్టుకుంటున్నారు. ఇద్దరు, ముగ్గురు పిల్లల్ని కనాలనే ఆలోచనే వారిలో ఉండట్లేదని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. ఉన్నత చదువులు చదివిన వారిలో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తోందని వారు పేర్కొన్నారు.

                                              

About Author