NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బాలలు భావి భారత పౌరులు..

1 min read

-చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ నాగార్జున రెడ్డి

పల్లెవెలుగు వెబ్ కడప : తమ పిల్లలను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దడమే తల్లిదండ్రుల యొక్క లక్ష్యమని, ఆ విధంగా వారిని తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని చెన్నై సూపర్ స్పెషాలిటీ చిన్న పిల్లల వైద్యులు డాక్టర్ నాగార్జున రెడ్డి అన్నారు , మంగళవారం ఆయన బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని తమ వైద్యశాలలో జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు, అనంతరం బాలల కు అయిన స్వీట్లు, చాక్లెట్లు పంచిపెట్టారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పిల్లల మానసిక వికాసానికి, సమగ్ర ఎదుగుదలకు క్రీడలతో పాటు, సాహిత్య, సంస్కృతి సాంప్రదాయాలు అలవడేటట్లు వారిని తల్లిదండ్రులు ప్రోత్సహించాలని తెలిపారు, అలాగే వ్యక్తిత్వ వికాసానికి ఎంత విలువ ఇస్తే అంతగా పిల్లలు ఎదిగి, ఇతరులను ప్రేమించే గుణం, పొందుతారని ఆయన తెలిపారు, ఇవన్నీ కూడా పెద్దలు ఎప్పటికప్పుడు తమ పిల్లలకు నేర్పిస్తారో, పిల్లలు కూడా తల్లిదండ్రుల పట్లనే కాకుండా సమాజం పట్ల బాధ్యతగా మెలుగుతారని ఆయన అన్నారు, అలాగే పిల్లల ఆరోగ్యం పట్ల కూడా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలియజేశారు, సీజన్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అదేవిధంగా పరిసరాల పరిశుభ్రత పై ఆకువగాహన కలిగి ఉండాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాలలతోపాటు ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.

About Author