విద్యార్థులచే కూలీ పని చేస్తున్న పంతుళ్ళు
1 min read– ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: శ్రీరంగాపురం మండల కేంద్రంలో జడ్పీహెచ్ఎస్ బాలుర ఉన్నత పాఠశాల చెందిన విద్యార్థులను మండల రిసోర్స్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో విద్యార్థులను ఆ పాఠశాలకు చెందిన పంతుల్లే కూలీలుగా మార్చిన వైనం, స్థానిక ఎంఆర్సి భవన ప్రారంభోత్సవ సందర్భంగా మంత్రి సింగిరెడ్డి రాబోతుండగా విద్యార్థులచే కుర్చీలు వేయించడం వాటిని శుభ్రపరచడం ఫ్లవర్ బొకే లను అందుబాటులో ఉంచడం లాంటి కూలి పనులను విద్యార్థులతో చేయించడంతో తల్లిదండ్రులు ఆగ్రహంతో ప్రశ్నిస్తున్నారు మా పిల్లలను బడికి పంపేది విద్యను అభ్యసించడానికి అని కూలి పనులకు కాదని తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం ఉపాధ్యాయులపై వ్యక్తం చేస్తున్నారు పక్కనే ఉన్న ఎంఈఓ జయరాములు కానీ ప్రధానోపాధ్యాయులు కానీ ఉపాధ్యాయులు ఈ చర్యలను నిరోధించకపోవడం తీవ్రంగా గ్రహించాల్సిన విషయం అని మండల ప్రజలు విమర్శిస్తున్నారు. దీనిపై ఉపాధ్యాయులపై తగు చర్య తీసుకోవాలని జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు.