లోబోకు కవల పిల్లలు.. ఆశీర్వదించిన మెగాస్టార్
1 min readపల్లెవెలుగు వెబ్ :బిగ్ బాస్ కంటెస్టెంట్ లోబో తండ్రయ్యాడు. ఈ విషయాన్ని లోబో ఇన్ స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. తన భార్య కవల పిల్లలకు జన్మనిచ్చినట్టు లోబో తెలిపాడు. ఒక బాబు, ఒక కూతురు పుట్టారని సంతోషం వ్యక్తం చేశాడు. దీంతో ఆయన అభిమానులు లోబోకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సైతం తన కవలలను ఆశీర్వదించాడంటూ ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇదిలా ఉంటే బిగ్‌బాస్ హౌస్‌లో ఉండగా లోబో తన భార్య గర్భవతి అని, ఈ సమయంలో తనకు తోడుగా లేనంటూ ఎమోషనల్ అయిన విషయం తెలిసిందే.