పిల్లలకు.. గర్భవతులకు ఐరన్ టాబ్లెట్లు సిరప్ లు అందించాలి
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: శనివారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి రామగిడ్డయ్య పోలకాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మరియు నాగులాపురం అంగన్వాడి సెంటర్ ను సందర్శించి సెంటర్ నందు ఉన్న గర్భవతులకు మరియు చిన్నపిల్లలకు ఐరన్ పోలిక టాబ్లెట్లు మరియు సిరప్ సక్రమంగా అందించారా లేదా అని అని అంగన్వాడీ సెంటర్ వారిని అడిగి అంగన్వాడి సెంటర్ నందు ఐరన్ సిరప్ ఐరన్ టాబ్లెట్లు లేనిచో వారు స్టాకును ఎప్పటికీ ఉండే విధంగా తెప్పించుకోవాలని మరియు ప్రతి ఒక్కరికే పిల్లలకు గర్భవతులకు ఐరన్ టాబ్లెట్లు సిరప్ లో అందించాలని ఆదేశించారు అంగన్వాడి సెంటర్ పిల్లలను గర్భవతులను సందర్శించి వారికి తగు సలహాలు సూచనలు అందించారు మరియు ఇందిరమ్మ హౌసెస్ మరియు వీకర్ సెక్షన్ కాలనీ అర్బన్ హెల్త్ సెంటర్లను సందర్శించి ఐరన్ టాబ్లెట్లు సిరప్ లో ఉన్నాయా లేవా అని విచారించి రికార్డ్స్ ను పరిశీలించారు రాష్ట్రస్థాయి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు ప్రోగ్రాం ఆఫీసర్లు అందరిని వారి పరిధిలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మరియు అంగన్వాడి సెంటర్ నందు ఐరన్ టాబ్లెట్లు సిరప్ లు ఉన్నాయా లేనిచో స్టాక్ ను తెప్పించి జిల్లా డ్రగ్స్టోర్ నుంచి తెప్పించుకోవాలని అందరికీ తెలియజేశారు.