PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాజ్యాంగం ప్రకారం పిల్లలను పరిరక్షించాలి

1 min read

– బాధ్యతను ఫోక్సో చట్టం సంబంధిత అధికారుల పై ఉంది.
– ఫోక్సో చట్టంపై శిక్షణా* తరగతులు నిర్వహణ..
– ఫస్ట్ అడిషనల్ జిల్లా జడ్జి పి.మంగా కుమారి వెల్లడి..

పల్లెవెలుగు వెబ్ ఏలూరు : పిల్లలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షించవలసిన బాధ్యత ప్రత్యేక పోలీస్, బాలల సంక్షేమ, ప్రత్యేక బాలల న్యాయమూర్తుల కమిటీల పై ఆధారపడి ఉందని మొదటి అదనపు జిల్లా జడ్జి పి. మంగా కుమారి తెలిపారు. శనివారం కలెక్టరేట్ లోని గోదావరి సమావేశ మందిరంలో ప్రత్యేక బాలల పోలీస్ యూనిట్, ప్రత్యేక బాలల న్యాయమూర్తుల విభాగం, బాలల సంక్షేమ అధికారులు మరియు ఇతర సంబంధిత అధికారులు, జిల్లా న్యాయసేవాధికార సంస్ధ ఆధ్వర్యంలో ఫోక్సో చట్టంపై శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా జడ్జి శ్రీమతి పి. మంగా కుమారి మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని మనమందరం గుర్తుంచుకోవాలని, రాజ్యాంగం ప్రకారం పిల్లల హక్కుల పరిరక్షణకు 2015 లో ఫోక్సో చట్టం తీసుకురావడం జరిగిందని తెలిపారు. సరైన సంరక్షణ, అభివృద్ధి, చికిత్స, సాంఘీక పునః నిర్మాణం ద్వారా వారి ప్రాధమిక అవసరాలు తీర్చడం కోసం ఈ చట్టం కల్పించిందని అన్నారు.చట్టం తో విభేదించిన పిల్లలు, సంరక్షణ అవసరమైన పిల్లల కొరకు జువనైల్ జస్టిస్ చట్టం రూపొందించటం జరిగింది. ఈ శిక్షణా కార్యక్రమంలో ఫోక్స్ చట్టం, పిల్లల సంరక్షణ చట్టం 2015, బాల్య సంక్షేమంపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని వీటిని పాల్గొన్న సంబంధిత అధికారులు వినియోగించుకొని అవగాహన పెంచుకొని స్నేహపూర్వక వాతావరణంలో చట్టాన్ని పకడ్బందీగా చట్టాన్ని అమలు చేయాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఫోక్సో స్పెషల్ జడ్జి శ్రీ మతి ఎస్. ఉమా సునంద మాట్లాడుతూ ఫోక్సో చట్టం అమల్లో అవరోదాలు రాకుండా చట్టంలో చెప్పిన విధంగా పిల్లల సంరక్షణపై ప్రత్యేక బాధ్యత చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎఎస్పీ నక్కా సూర్యచంద్రరావు మాట్లాడుతూ కాలానుగుణంగా మార్పులు వస్తున్నాయని మా నవతా ధృక్పదంతో పోలీసువారు పిల్లల సంరక్షణ చేపట్టాలని ఉన్నారు. పోలీసు స్టేషన్లో ఈ చట్టప్రకారం ప్రత్యేక ప్రోటక్షన్ గది ఉందని, పిల్లల బాధ్యతను మన సొంత పిల్లలుగా బాధ్యత స్వీకరించాలన్నారు.ఈ కార్యక్రమంలో పర్మినెంట్ లోక్ అథాలత్ చైర్ పర్సన్ శ్రీమతి ఎ.మేరీ గ్రేస్ కుమారి మాట్లాడుతూ ఫోక్సో యాక్ట్ పై నిర్వహిస్తున్న శిక్షణ ద్వారా వృత్తిలో నైపుణ్యం పెంచుకోవడానికి, ఈ శిక్షణ అవసరమని అన్నారు. పిల్లలకు నష్టపరిహారం చెలించడంలో చైల్డ్ వెల్పేర్ పాత్ర, పిల్లల పరిరక్షణకు పోలీసు వారి పాత్ర గురించి చట్టంలో పొందుపరచిన అంశాలను తెలియజేశారు. ఫోక్స్ యాక్ట్ గురించి కమిటీ లో ని మెంబర్స్, పోలీసు, బాల్య సంక్షేమం బాధ్యతలపై శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ శిక్షణ లో ముఖా ముఖి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. శిక్షణ అనంతరం యూనిట్ మెంబర్స్ కు న్యాయమూర్తులు సర్టిఫికెట్లను అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఇంచార్జ్ కార్యదర్శి మరియు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి డి శ్రీనివాసులు, బార్ అసోషియేషన్ సెక్రటరీ సుబ్బారావు, సిడబ్ల్యూసి చైర్ పర్సన్ బి. రెబకారాణి, ఇంప్లిమెంటేషన్ జెజె యాక్ట్ చట్టం డిపిఓ జె. దుర్గాప్రసాదు, మాస్టర్ ట్రైనర్ తెగిరిపల్లి సుబ్బారావు, డిఎస్పీ పైడేశ్వరావు, సిఐలు, ఎస్సైలు, యూనిట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

About Author