చిన్నారులు క్రమశిక్షణతో మెలగాలంటే క్రీడల్లో పాల్గొనాలి..
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు లోని పెద్దమార్కట్ వద్దనున్న శ్రీ లక్ష్మీనరసింహా స్వామి కళ్యాణ మండపంలో తైక్వాండో వేసవి శిక్షణ తరగతులను డాక్టర్. శంకర్ శర్మ ప్రారంభించారు. తైక్వాండో శిక్షకుడు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో చిన్నారులకు తైక్వాండో లో శిక్షణ ఇస్తున్నారు. ఈవేసవి శిక్షణ తరగతులు నెల రోజుల పాటు కొనసాగనున్నాయి. ఈసందర్భంగా ముఖ్య అతిథి డాక్టర్. శంకర్ శర్మ క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉన్నందున ఉదయమే మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేసుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు వారి పిల్లలపై శ్రద్ధ పెట్టి చిన్న తనం నుంచే క్రీడల్లో పాల్గొనేటట్లు ప్రొత్సహించాలని కోరారు. క్రీడల్లో పాల్గొంటే జీవితంలో క్రమశిక్షణ అలవాటు అవుతుందన్నారు. మార్షల్ ఆర్ట్స్ లో యోగా, ప్రాణాయామం, వ్యాయామం ఉండడం వల్ల ఏకాగ్రత పెరుగుతుందన్నారు. శుభ్రమైన ఆహారం, నీరు తీసుకోవాలని డాక్టర్. శంకర్ శర్మ తెలియజేశారు. జంక్ పుడ్ ను తినకుండా పండ్లు ఎక్కువగా తీసుకోవాలన్నారు. ఆరోగ్యం గా ఉన్న వారే దేశ భవిష్యత్తుకు ఉపయోగపడుతారన్నారు. ఉదయం విద్యార్థులు శిక్షణ తీసుకుంటున్నందున వారికి ఉపయోగకరంగా ఉంటుందని హాట్ బాక్స్ లను క్రీడాకారులందరికి డాక్టర్. శంకర్ శర్మ అందజేశారు. ఈకార్యక్రమం లో తైక్వాండో శిక్షకుడు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.