రెండు పోలియో చుక్కలతో చిన్నారులకు బంగారు భవిష్యత్తు..
1 min read0-5 సంవత్సరాల పిల్లలకు పోలియో చుక్కలు వేయించండి..
మేయర్ షేక్ తూర్జహాన్ పెదబాబు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : రెండు పోలియో చుక్కలతో చిన్నారులు జీవితాంతం ఆరోగ్యంగా ఉండే బంగారు బాట వేయాలని తల్లిదండ్రులకు నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు పిలుపునిచ్చారు. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఆధ్వర్యంలో పోలియో నివారణ దినోత్సవం పురస్కరించుకొని నేడు స్థానిక తంగెళ్ళమూడి లో ఉన్న మున్సిపల్ అర్బన్ హెల్త్ సెంటర్ నందు పోలియో చుక్కల శిబిరాన్ని నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు ప్రారంభించారు.అనంతరం పెద్ద సంఖ్యలో వచ్చిన చిన్నారులకు 2 పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ భారతదేశం పోలియో రహిత దేశంగా విజయవంతంగా ఉండాలంటే పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాల వయస్సు పిల్లల వరకు ప్రతి ఒక్కరికి రెండు పోలియో చుక్కలు వేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు నూక పేయి సుధీర్ బాబు, జి శ్రీనివాస్ ,కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, ఎంహెచ్ఓ డాక్టర్ మాలతి, కార్పొరేటర్లు దేవరకొండ శ్రీనివాసరావు, నున్న స్వాతి శ్రీదేవి కిషోర్,అర్జీ సత్యవతి నాగేశ్వరరావు,ఈదుపల్లి కళ్యాణి పవన్,ఏఎంసీ చైర్మన్ నేరుసు చిరంజీవులు, స్థానిక వైసిపి నాయకులు పల్లా రమేష్, గవరపేట నాయుడు తదితరులు పాల్గొన్నారు.