కోట జడ్పీ పాఠశాలలో ఘనంగా “బాలల దినోత్సవ ” వేడుకలు
1 min readపల్లెవెలుగు, వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల కోట నందు “బాలల దినోత్సవం”(చిల్డ్రన్స్ డే) ఘనంగా నిర్వహించారు. భారత ప్ర ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం నవంబరు 14 వ తేదీన “బాలల దినోత్సవం” నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలో మంగళవారం పాఠశాల ప్రార్థన సమయంలో పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ శ్రీనాథ్ పెరుమాళ్ళ ఆద్వర్యంలో బోధన బోధనేతర సిబ్బంది “చాచా నెహ్రూ” చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం నెహ్రూ గొప్పతనం గురించి, ఆయన భారతదేశానికి చేసిన సేవలను గురించి, ఏ విధంగా భారత దేశంలోని విద్య,వైద్య,సాంకేతిక, నీటి ప్రాజెక్టుల అభివృద్ధి కి కృషి చేశారు అనే విషయాలను పాఠశాల సోషియల్ ఉపాధ్యాయులు వెంకట రమణ విద్యార్థులకు చక్కగా వివరించారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సలీం భాష విద్యార్థులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తదనంతరం పాఠశాల విద్యార్థుల కు పాఠశాల ప్రథమ సహయకురాలు శారదమ్మ విద్యార్థులకు బిస్కెట్లు పంపిణీ చేశారు. అనతరం జరిగిన కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సాలమ్మ, అరుణా విజయ భారతి,లలితమ్మ, సరోజిని దేవి, షంషాద్ బేగం, వెంకటేశ్వర్లు, మల్లికార్జున రెడ్డి, నాగశేషులు, రామిరెడ్డి, నాన్ టీచింగ్ స్టాఫ్ మురళీ కృష్ణ , పాములేటమ్మ యోగా ఇన్స్ట్రక్టర్ సుంకన్న తదితరులు పాల్గొన్నారు.