ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
1 min readపల్లెవెలుగు వెబ్, నందికొట్కూరు: అఖిలభారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) ఆధ్వర్యంలో ఏఐటియుసి కార్యాలయం నందు బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలలతో కేక్ కట్ చేయించి… బాలబాలికలకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిపిఐ తాలూకా నాయకులు రమేష్ బాబు, ఏఐవైఎఫ్ తాలూకా అధ్యక్ష కార్యదర్శులు శేషన్న అనిల్ కుమార్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం 1 నుంచి 14 ఏళ్ల పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అందించాలని నిబంధన పగడ్బందీగా కొనసాగించక పోవడం తో స్కూల్లో డ్రాపౌట్స్ పెరిగి బాలకార్మిక వ్యవస్థ ఏర్పడుతుందన్నారు. బిజెపి ప్రభుత్వం చరిత్రను రూపుమాపాలనుకోవడం అవివేకమన్నారు. భారతదేశ మొట్టమొదటి ప్రధాని మంత్రిగా బాధ్యతలు చేపట్టి వ్యక్తుల కంటే వ్యవస్థకే ప్రాధాన్యత ఇచ్చి భారతదేశ నిర్మాణంలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్న పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతిని బాలల దినోత్సవంగా నిర్వహించు కుంటున్నామని, నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అనే స్లోగన్ విజయవంతం కావాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డ్రాపౌట్స్ విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు రమేష్, దినేష్ రాముడు , జస్వంత్ తదితరులు పాల్గొన్నారు.