చిన్నారుల అభిరుచులను ప్రోత్సహించాలి
1 min read– నారాయణ విద్యాసంస్థల ఏజీఎం రమేష్ కుమార్ ప్రత్యేకత అభినందించారు
– ఘనంగా గ్రాడ్యుయేషన్ సంబరాలు.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: చిన్నారుల అభిరుచులను అలవాట్లను గుర్తించి తల్లిదండ్రులూ మరింత ప్రోచహిస్తే మెరుగైన పలితాలు సాధిస్తారని పెడియాట్రిక్స్ వైద్యురాలు ఏమ్. విజయవాణి సూచించారు. స్థానిక మాధవ నగర్ లోని నారాయణ పాఠశాలలో AGM రమేష్ కుమార్ ఆదేశాల మేరకు ప్రిన్సిపాల్ మహమ్మద్ althaf అధ్వర్యంలో ఈ కిడ్స్ విభాగంలోని యుకేజి విద్యార్థుల గ్రాడ్యుయేషన్ సంబరాలు ఘనంగా జరిగాయి. ముందుగా యుకెజి విద్యార్ధులు పట్టభద్రుల వేషధారణలో అతిథిని వేదిక పైకి స్వాగతించి, గ్రాడ్యుయేషన్ వేడుకలను జ్యోతి ప్రజ్వలన తో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఈ కిడ్స్ విభాగం వైస్ ప్రిన్సిపల్ రాధ విద్యా సంవత్సరం రిపోర్ట్ వెల్లడించారు. ఈ సందర్భంగా అతిథి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంటుంది, సకాలంలో అవకాశాలు సద్వినియోగం చేసుకుంటే పలితాలు వస్తాయన్నారు. తల్లిదండ్రుల అభిరుచులు తమ పిల్లల పై భారం వేయడంతో వారు ఒత్తిడికి లోనవుతారన్నారు. ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్న తలిదండ్రులు తమ పిల్లల కోసం రోజుకు గంట సమయం కేటాయించాలని, cell phone కు దూరంగా ఉంచాలన్నారు. కిండర్ గార్డెన్ పూర్తి చేసుకున్న చిన్నారులకు సర్టిఫికేట్ అందజేశారు. చిన్నారుల పట్టాదారు వేషధారణను తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. చివరిగా చిన్నారుల సాంసృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో RI దుర్గాలక్ష్మి, ఈ కిడ్స్ కో ఆర్డినేటర్ అరుణ, soft స్కిల్ నాగరాజు, వైస్ ప్రిన్సిపాల్ ముంతాజ్ బేగం పాల్గోన్నారు.