మిరప పంట పరిశీలన
1 min readపల్లెవెలుగు వెబ్ : ఎమ్మిగనూరు నియోజకవర్గం నందవరం మండలం ఇబ్రహీం పురం గ్రామం లో నరసన్న అనే రైతు పొలంలో కావేరి కంపెనీ మిరప1222 పంటను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కార్యక్రమంలో కంపెనీ డిప్యూటీ Abm వెంకటేష్ , మాట్లాడుతూ కావేరీ మిరప1222 అనే రకం అధిక దిగుబడినిచ్చే తెగుళ్ళను తట్టుకుని కాయ మచ్చ 90 శాతం తక్కువగా ఉంటుందని తెలిపారు . కార్యక్రమంలో నందవరం మండలం నుండి సుమారు 300 మంది రైతులు పాల్గొన్నారు. కావేరి కంపెనీ సేల్స్ ఆఫీసర్ రాజశేఖర్ రెడ్డి గారు ,డిస్ట్రిబ్యూటర్ త్రివేణి ఆగ్రో ఎంటర్ప్రైజెస్ ప్రొప్రైటర్ జి ఎం అశోక్ గారు, మానా సత్యనారాయణ గారు, కంపెనీ స్టాప్ ఆంజనేయులు
పురందరదాసు హరి తదితరులు పాల్గొన్నారు.