ప్రపంచ ఆర్థిక శక్తిగా చైనా !
1 min readపల్లెవెలుగు వెబ్: ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశంగా చైనా నిలిచింది. అమెరికాను దాటుకుని మొదటి స్థానంలో నిలిచింది. మెక్ కిన్సే అండ్ కో రీసర్చ్ టీం 10 వేల బ్యాలెన్స్ షీట్లను పరిశీలించి ఈ విషయాన్ని వెల్లడించినట్టు బ్లూమ్ బర్గ్ పత్రిక పేర్కొంది. చైనా ఆదాయం దాదాపు ప్రపంచ ఆదాయంలో మూడో వంతుగా ఈ నివేదిక పేర్కొంది. చైనా, అమెరికాల్లో మూడింట రెండొంతుల సంపద కేవలం 10 శాతం కుటుంబాల వద్ద పోగుపడిందని ఈ నివేదిక పేర్కొంది. ఈ సంపన్న కుటుంబాలు మరింత సంపదను పోగు చేసుకుంటున్నాయని వివరించింది. 68 శాతం గ్లోబల్ నెట్ వర్త్ రియల్ ఎస్టేట్‌లోనే ఉందని తెలిపింది. ప్రపంచ వాణిజ్య సంస్థలో చేరకుముందు చైనా సంపద 7 ట్రిలియన్ డాలర్లు ఉండగా… ప్రస్తుతం 120 ట్రిలియన్ డాలర్లుగా ఉందని ఈ నివేదిక పేర్కొంది.