PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కోటీశ్వరుల‌పై చైనా క‌న్నెర్ర !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : క‌మ్యూనిస్టు పార్టీ నేతృత్వంలోని చైనా ప్రభుత్వం కోటీశ్వరుల‌ను టార్గెట్ చేసింది. ప్రపంచంలోనే ప్రముఖ కంపెనీల్లో ఒక‌ట‌యిన అలీబాబా గ్రూప్ అధినేత జాక్ మాను.. తెర‌వెన‌క్కి నెట్టడంతో ప్రారంభ‌మైన చైనా నియంత్రణ చ‌ర్యలు.. మిగిలిన పారిశ్రామికవేత్తల పై కూడ కొన‌సాగుతున్నాయి. ఇటీవ‌లే ప్రముఖ టెక్నాల‌జీ సంస్థ టెన్సెంట్ ఆధిప‌త్యానికి క‌త్తెర వేసింది. క్యాబ్ సేవ‌లు అందించే డీడీ సంస్థ మీద వేటు వేసింది. హాంకాంగ్ ఉద్యమ‌కారుల‌ను స‌పోర్ట్ చేసిన ఓ కంపెనీ అధినేత‌ని 18 నెల‌లు జైల్లో పెట్టింది. చైనాలో 25 అతిపెద్ద టెక్నాల‌జీ సంస్థల‌పై నియంత్రణ విధించింది. దీంతో షాంఘై స్టాక్ మార్కెట్ భారీ న‌ష్టాల్నిచ‌విచూసింది. అమెరికాలో లిస్టయిన చైనా కంపెనీల షేర్లు భారీ న‌ష్టాల‌ను చ‌విచూసాయి. ల‌క్ష కోట్ల మేర సంప‌ద ఆవిరైంది. చైనా ప్రభుత్వ విధానాల‌తో ఇన్వెస్టర్లు న‌ష్టపోయారు. చైనా కంపెనీల్లో పెట్టుబ‌డులు పెట్టాలంటే భ‌య‌ప‌డే ప‌రిస్థితి నెలకొంది. త‌మ పౌరుల వ్యక్తిగ‌త వివ‌రాలు గోప్యంగా ఉంచేందుకు టెక్నాల‌జీ కంపెనీల పై నియంత్రణ విధిస్తున్నామ‌ని చెబుతున్నప్పటికీ.. చైనా ప్రభుత్వం కీల‌కమైన ఆర్థిక మార్పుల‌కు శ్రీకారం చుట్టేందుకు ఇంద‌తా చేస్తోంద‌ని నిపుణులు భావిస్తున్నారు.

About Author