భారత బాలుడిని కిడ్నాప్ చేసిన చైనా
1 min readపల్లెవెలుగువెబ్ : అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన మీరామ్ టారోన్ అనే బాలుడిని చైనా ఆర్మీ కిడ్నాప్ చేసినట్టు అరుణాచల్ ఎంపీ తపిర్ గావో ఆరోపించారు. భారత భూభాగంలోని సియాంగ్ జిల్లాలో కిడ్నాప్ కు గురైనట్టు ఆయన తెలిపారు. దీంతో సమాచారం అందుకున్న భారత ఆర్మీ.. హాట్‌లైన్ సాయంతో మీరామ్ టారోన్ విషయాన్ని పీఎల్ఏకు తెలిపింది. బాలుడుని పట్టుకొని ప్రొటోకాల్ ప్రకారం తమకు అప్పగించాలని ఇండియన్ ఆర్మీ.. చైనా సైన్యాన్ని కోరింది. మూలికలు సేకరించడానికి, వేటుకు వెళ్లిన సదరు బాలుడు దారితప్పిపోయి అదృశ్యం అయినట్లు తెలుస్తోంది.