భారత్ లోని ప్రాంతాలకు చైనా పేర్లు !
1 min readపల్లెవెలుగువెబ్ : భారత దేశంలో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలకు చైనా తమ పేర్లు పెట్టుకుంది. సుమారు 15 ప్రాంతాలకు చైనా భాషలో పేర్లు మార్చడాన్ని డ్రాగన్ దేశం సమర్థించుకుంది. ఆ ప్రాంతాలు దక్షిణ టిబెట్‌లో ఉన్న తమ అంతర్గత భాగంలోనివని చైనా వక్రబుద్ధిని ప్రదర్శించింది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని 15 ప్రాంతాల పేర్లను చైనా మార్పుచేయడాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్ దేశంలో అంతర్భాగమని భారత్ స్పష్టం చేసింది. చైనా కుయుక్తులతో ఆ ప్రాంతాల పేర్లు మార్చితే సత్యం మారిపోదని తేల్చి చెప్పింది.